SURYA JAYANTI AT SRINIVASA MANGAPURAM TEMPLE _ తిరుచ్చిపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి అభయం

Tirupati,16 February 2024:  On the occasion of Surya Jayanti grand Ratha Sapthami fete was observed at Sri Kalyana Venkateswara temple, Srinivasa Mangapuram on Friday with several special programs.       

As part of celebrations after morning Kainkaryams, Swami along with His two consorts was taken out along Mada streets on Bangaru Tiruchi to bless devotees.

Special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Chengalrayulu, temple inspector Sri Kiran and others were present.                                             

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుచ్చిపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి అభయం

తిరుపతి, 2024 ఫిబ్ర‌వరి 16: సూర్యజయంతిని పురస్కరించుకొని శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రథసప్తమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంలో మేల్కొలిపి, తోమాల‌, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం, అర్చ‌న నిర్వ‌హించారు. అనంత‌రం ఉదయం 6 నుండి 7 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత
శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.