SURYANARAYANA SHINES ON SURYAPRABHA _ సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణ స్వామివారి అలంకారం శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కటాక్షం
TIRUPATI, 16 JUNE 2022 Sri Prasanna Venkateswara Swamy on the bright Sunny day on seventh day morning took out a celestial ride on Suryaprabha Vahanam.
The devotees had the pleasure of witnessing Sri Suryanarayana on the carrier.
DyEO Sri Lokanatham, Superintendent Smt Srivani and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణ స్వామివారి అలంకారం శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కటాక్షం
తిరుపతి, 2022 జూన్ 16: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణ స్వామివారి అలంకారం శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఔషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే శ్రీ ప్రసన్న సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
జూన్ 17న రథోత్సవం
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది.. ఉదయం 8.05 నుండి 10 గంటల వరకు స్వామి వారు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణభట్టార్ శ్రీసూర్యకుమార్ ఆచార్యులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.