MAHA SAMPROKSHANA OF SRI VAKULAMATA TEMPLE FROM JUNE 18-23 _ జూన్ 18 నుండి 23వ తేదీ వ‌ర‌కు శ్రీ వ‌కుళమాత‌ ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ

Tirupati, 16 June 2022:TTD is organising a Maha Samprokshana celebrations of Sri Vakulamata temple which has been revived near Perur from June 18-23.

The Vigraha Pratista and Maha Samprokshana festivities will be performed between 7.30am and 8.45 am on June 23.

The daily programs of the celebrations are as follows…

* On June 18 evening the Ankurarpanam fete will be observed after rituals of Shobha Yatra, Punyahavachanam, Acharya Ritwik Varanam, and Mrutsangrahanam.

* On June 19 morning Punyahavachanam, Raksha bandhana, Akalmasha Homam Akshimochanam, Panchagavya Adhivasam will be performed and later in the evening Agni Pratista, Kalasa Sthapana, Kumbhavahana, Kumbha Aradhana and Ukta Homas will take place.

* June 20 morning Kumbha Aradhana, Ukta Homas and Navakalasa Snapana, Ksheeradhivasam, and Ukta Homas takes place

* June 21 morning Punyahavachanam, Kumbha Aradhana, Homas, Chaturdasha Kalasa Snapanam, Jaladhivasam followed by Homas

* On June 22 Ratnadhivasam, Kumbha aradhana homas followed by Vimana Kalasa Sthapana, Gopura Kalasa Sthapana, Ratna Nyasam, Vigraha Sthapana, Snapana Tirumanjanam in afternoon. Later in the evening Maha Shanti Tirumanjanam, Kumbha Aradhana, Nivedana, Sayanadhivasam, Visesha Homas and yagashala programs.

* On June 23 in early morning Kumbharadhana, Nivedana, Homam, Maha Purnahuti, Vimana kalasha Avahana, will be observed.

* Later between 7.30am and 8.30am on Mithun Lagnam Prana Pratistha, Maha Samprokshana will be performed. Akshatarohanam, Archaka Bahumanam. Dwajarohanam will be performed at 10.30 am and then devotees will be allowed for Darshan.

TTD is organising Shanti Kalyanotsavam in the evening and Dwajavarohanam is performed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 18 నుండి 23వ తేదీ వ‌ర‌కు శ్రీ వ‌కుళమాత‌ ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ

తిరుపతి, 2022 జూన్ 16: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జూన్ 18 నుండి 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. జూన్ 23వ తేదీన‌ ఉద‌యం 7.30 నుండి 8.45 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

జూన్ 18వ తేదీ సాయంత్రం 6.30 గంట‌ల‌కు శోభాయాత్ర‌, రాత్రి 7.30 గంట‌ల‌కు పుణ్యాహ‌వ‌చ‌నం, ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

జూన్ 19న ఉద‌యం 6.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, అక‌ల్మ‌ష‌హోమం, అక్షిమోచ‌నం, పంచ‌గ‌వ్యాధివాసం చేప‌డ‌తారు. సాయంత్రం 6.30 గంట‌లకు అగ్నిప్ర‌తిష్ట‌, క‌ల‌శ‌స్థాప‌న‌, కుంభావాహ‌నం, కుంభారాధ‌న‌, ఉక్త హోమాలు నిర్వ‌హిస్తారు.

జూన్ 20న ఉద‌యం 8.30 గంట‌లకు కుంభారాధ‌న‌, ఉక్త హోమాలు, న‌వ క‌ల‌శ స్న‌ప‌న క్షీరాధివాసం, సాయంత్రం 6.30 గంట‌ల‌కు హోమాలు, యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

జూన్ 21న ఉద‌యం 8.30 గంట‌లకు పుణ్యాహ‌వ‌చ‌నం, కుంభారాధ‌న‌, చ‌తుర్ధ‌శ క‌ల‌శ స్న‌ప‌న జ‌లాధివాసం, సాయంత్రం 6.30 గంట‌ల నుండి హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

జూన్ 22న ఉద‌యం 8 గంట‌ల‌కు ర‌త్న‌ధాతు అధివాసం, కుంభారాధ‌న‌, హోమాలు, ఉద‌యం 10.45 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విమాన క‌ల‌శ స్థాప‌న‌, గోపుర క‌ల‌శ స్థాప‌న‌, ర‌త్న‌న్యాసం, ధాతున్యాసం, విగ్ర‌హ స్థాప‌న, మ‌ధ్యాహ్నం 2 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి తిరుమంజ‌నం, రాత్రి 8 గంట‌లకు కుంభారాధ‌నం, నివేద‌న‌, శ‌య‌నాధివాసం, విశేష హోమాలు, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

జూన్ 23న ఉద‌యం 4.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న‌, నివేద‌న‌, హోమం, మ‌హాపూర్ణాహుతి, విమాన గోపుర క‌ల‌శ ఆవాహ‌న, ఉద‌యం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు మిథున ల‌గ్నంలో ప్రాణ ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత అక్ష‌తారోహ‌ణం, అర్చ‌క బ‌హుమానం అందిస్తారు. ఉద‌యం 10.20 గంట‌ల‌కు ధ్వ‌జారోహ‌ణం, ఉద‌యం 10.30 నుండి భ‌క్తుల‌కు అమ్మవారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు శాంతి క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది. అనంత‌రం ధ్వ‌జావ‌రోహ‌ణం చేప‌డ‌తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.