RAMACHANDRA SHINES ON SURYAPRABHA _ సూర్యప్రభ వాహనంపై శ్రీ రామచంద్రుడి వైభవం

Tirupati, 11 April 2024: The seventh day on Thursday witnessed Sri Ramachandra Murty taking a celestial ride on Suryaprabha Vahanam.

The beauty of Suryaprabha Vahanam enhanced with the Lord Sri Rama shining on the Sun carrier.

Both the pontiffs of Tirumala, DyEO Smt Nagaratna and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సూర్యప్రభ వాహనంపై శ్రీ రామచంద్రుడి వైభవం

తిరుపతి, 2024 ఏప్రిల్ 11: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు.

ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యుడు తేజోనిధి. సకలరోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.

అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, కంకణభట్టర్ శ్రీ సీతారామాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.