“SURYAVAMSAJA” RIDES ON SURYAPRABHA VAHANAM_ సూర్యప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

Tirupati, 22 March 2018: On the seventh day morning on Thursday, Lord Sri Rama took celestial ride on the bright Suryaprabha Vahana.

Lord Sri Rama Chandra was born in the famous Surya Vamsa Dyanasty. All the predecessors of Lord Sri Rama starting from King Ikshwaku belong to the Solar Dynasty and became legendaries.

The brightness of the vahanam doubled with the presence of the most charismatic king of Surya Vamsa taking a royal ride on the glittering Surya Prabha vahanam to bless the devotees in mada streets.

DyEO Smt Jhansi, Executive Engineer Sri Jagadeeswara Reddy, AVSO Sri Ganga Raju, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

మార్చి 22, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. భజనలు, కోలాటాల మధ్య స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామివారు ఊరేగడం ఆనందదాయకం.

వాహనసేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వేడుకగా జరుగనుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ జరగనుంది.

చంద్రప్రభ వాహనం :

చంద్రుడు భగవంతుని మారురూపమే. రసస్వరూపుడైన చంద్రుడు ఓషధులను పోషిస్తున్నాడు. ఆ ఓషధులు లేకపోతే జీవనం లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవరప్రభతో శ్రీ కోదండరామస్వామి దర్శనమిస్తున్నాడు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 7 నుండి 8 గంటల వరకు ధర్మగిరి వేద పాఠశాల ఆధ్వర్యంలో వేదపారాయణం నిర్వహించారు.

శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

మార్చి 23న రథోత్సవం :

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు రథోత్సవం జరుగనుంది. రథోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లను ఇంజినీరింగ్‌ అధికారులు పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.