ANNUAL VASANTHOTSAVAM IN TIRUMALA FROM MARCH 29 TO 31_ మార్చి 29 నుండి 31 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Tirumala, 22 March 2018: The annual three-day vasanthotsavams in Tirumala will be observed from March 29 to 31 in Vasantha Mandapam.

Every year this fete is performed that it concludes on the auspicious day of Chaitra Suddha Pournami.

On these three days the processional deities will be rendered Snapana Tirumanjanam in a colourful manner. On first and second days Snapanam will be performed to Sridevi Bhudevi Sametha Sri Malayappa Swamy while on last day, Snapanam is performed to Sri Sita Lakshmana Anjaneya Sametha Sri Ramachandra Murthy as well to Sri Rukmini Sametha Sri Krishna Swamy also.
Every day this fete will be observed between 2pm and 4pm.

On second day, there will be procession of Swarna Ratham between 8am and 9am.

TTD has cancelled Tiruppavada Seva, Nijapada Darshanam, Kalyanotsavams, Arjitha Brahmotsavam and Sahasradeepalankara Sevas during these three days in connection with Salakatla Vasanthotsavam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 29 నుండి 31 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

మార్చి 22, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29 నుండి 31వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. చైత్రశుద్ధ త్రయోదశిరోజు అనగా మార్చి 29వ తేదీన ఉదయం 7.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తియిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

రెండవరోజు మార్చి 30వ తేదీన శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు బంగారు రథం అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు మార్చి 31వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయాన్ని చేరుకుంటారు.

ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6.00 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.

వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పాడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.

వసంతోత్సవ వేడుకలను పురస్కరించుకొని మార్చి 29వ తేదీన తిరుప్పావడసేవ, మార్చి 30వ తేదీన తోమాలసేవ, అర్చన, నిజపాద దర్శనంసేవలను రద్దు చేశారు. అదేవిధంగా మార్చి 29 నుండి 31వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు భక్తులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.