SV AYURVEDA COLLEGE BAGS THREE ISO CERTIFICATES -TTD EO AWARDS THE CERTIFICATES _ ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు మూడు ఐఎస్ వో సర్టిఫికెట్లు – ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చేతుల మీదుగా ప్రదానం

TIRUPATI, 29 MARCH 2023: TTD EO Sri AV Dharma Reddy has presented the prestigious ISO certificates to SV Ayurveda College Principal Dr Muralikrishna on Wednesday.

The event took place at the Chamber of EO in the TTD Administrative Building. The Ayurvedic college bagged three ISO certificates for the maintenance of greenery in the college premises, for implementing best methodologies in college administration and for eco-friendly practices.

TTD EO complimented the Principal and his team including vice-principal Dr Sundaram and others. ISO representatives Sri Sivaiah, Smt Moulika were also present.  

Besides, SVBC has also bagged ISO certification for following best practices in its management. SVBC CEO Sri Shanmukh Kumar received the certificate from TTD EO on the occasion.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు మూడు ఐఎస్ వో సర్టిఫికెట్లు – ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చేతుల మీదుగా ప్రదానం

తిరుపతి 29 మార్చి 2023: శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలకు మూడు విభాగాల్లో ఐ ఎస్ వో సర్టిఫికెట్లు లభించాయి. టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ అందుకున్నారు.

ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యుత్ పొదుపు చేసినందుకు, కళాశాల ఆవరణంలో పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు సర్టిఫికెట్లు లభించాయి. అలాగే కళాశాల.నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు మరో సర్టిఫికెట్ లభించాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, ఇతర అధ్యాపకులు, సిబ్బందిని ఈవో శ్రీ ధర్మారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.

కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, ఐ ఎస్ వో ప్రతినిధులు శ్రీ శివయ్య, శ్రీమతి మౌళిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎస్వీబీసీకి …

శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు గాను ఐ ఎస్ వో సర్టిఫికెట్ లభించింది. ఎస్వీబీసీ సి ఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్ ఈవో శ్రీ ధర్మారెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది