SV AYURVEDA COLLEGE STUDENTS BAG 3 GOLD AND ONE SILVER MEDALS _ ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థులకు మూడు బంగారు , వెండి ప‌త‌కాలు

TTD EO & JEO COMPLIMENTS WINNERS

 Tirupati, 18 July 2022: Four meritorious students of SV Ayurveda College who displayed exemplary talent in the Ayurveda courses were presented with three Gold and One silver medals at a program held in Dr NTR Health University at Vijayawada on Sunday last.

The students adjudged as ‘Best Outgoing Student’ had bagged highest marks in the courses during last academic year belonging to Ayurveda College in Telugu states.

Dr Lakshmi Alekhya was adjusted Best Outgoing Student in the BA and MS course and presented both gold and silver medal.

In the MD Pancha Karma course Dr Samatha Prakash bagged the gold medal and Dr P Hemaraj won the third gold medal for his excellence in Sanskrit and Padartha Vijnan Test of BA & MS first year course.

TTD EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam and Ayurveda College Principal Dr. Murali Krishna lauded and complimented the students.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థులకు మూడు బంగారు , వెండి ప‌త‌కాలు

– విద్యార్థుల‌ను అభినందించిన ఈవో, జెఈవో

తిరుపతి, 2022 జూలై 18: ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు చెందిన న‌లుగురు విద్యార్థులు అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి, ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల ప‌రిధిలో మూడు బంగారు ప‌త‌కాలు , ఒక వెండి పతకం సాధించారు. విజ‌య‌వాడ డాక్ట‌ర్ ఎన్‌టిఆర్ హెల్త్ యూనివ‌ర్శిటిలో ఆదివారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విద్యార్థుల‌కు బంగారు ప‌త‌కాలు ప్ర‌దానం చేశారు.

బిఎఎమ్ఎస్ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తమ అవుట్ గోయింగ్ విద్యార్థి డాక్ట‌ర్ ల‌క్ష్మి అలేఖ్య అత్య‌ధిక మార్కులు సాధించి బంగారు , వెండి ప‌త‌కాలు పొందారు. ఎండి పంచకర్మలో ఉత్తమ అవుట్ గోయింగ్ గా అత్య‌ధిక మార్కులు సాధించి డాక్ట‌ర్ స‌మ‌తా ప్ర‌కాష్ బంగారు ప‌త‌కం పొందారు. డాక్ట‌ర్ పి.హేమ‌రాజు బిఎఎమ్ఎస్ మొదటి సంవత్సరంలో సంస్కృతం మ‌రియు ప‌దార్థ విజ్ఞానం ప‌రీక్ష‌లో అత్యధిక మార్కులు సాధించి బంగారు ప‌త‌కం పొందారు. ఉత్త‌మ ఫ‌లితాలు సాధించి బంగారు ప‌త‌కాలు పొందిన విద్యార్థుల‌ను, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ‌ను ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అభినందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.