SV BALA MANDIR STUDENTS SHOULD EARN TOP HONOURS- TTD CHAIRMAN_ ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి: టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
Tirupati, 27 Jul. 19: TTD Chairman Sri YV Subba Reddy today exhorted the students of SV Bala Mandir should earn top honors academically and achieve new heights in society.
Speaking after an inspection of SV Bala Mandir, home of orphans run by TTD, the chairman said majority of them had become doctors and engineers and were serving in TTD and all government sector in good posts.
Presently the SV Bala Mandir accommodated 500 students who were provided Anna Prasadam, lodging and education by TTD. It is their privilege to be educated at the altar of Sri Venkateswara.
He advised officials to introduce Annamacharya sankeertans in prayers of the institution .TTD supported them in their endeavor for higher studies including IIIT Courses.
Earlier he inspected the Prayer hall, kitchen, and quality not Anna Prasadam, toilets and hostel rooms and also interacted with the students.
DyEO Smt Bharati, AEO Smt. Tamara Selvi, Superintendent Sri Sudhakar participated
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి: టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
తిరుపతి, 27 జూలై 2019: ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలని టిటిడి ధర్మకర్తలమండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి కోరారు. తిరుపతిలోని ఎస్వీ బాలమందిరాన్ని శనివారం ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ ఎందరో అనాథ పిల్లలకు ఎస్వీ బాలమందిరం కల్పతరువుగా మారిందని అన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు వైద్య విద్య, బిటెక్, ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదివారని అన్నారు. టిటిడిలోను, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారన్నారు. ప్రస్తుతం ఇక్కడ 500 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరందరికీ క్రమం తప్పకుండా అన్నప్రసాదాలు, వసతి కల్పిస్తున్నారని తెలిపారు. శ్రీవారి చెంత విద్యను అభ్యసించడం పూర్వ జన్మ సుకృతం, అదృష్టవంతులని, అందువల్ల అందరికన్నా మెరుగ్గా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రార్థనలో అన్నమయ్య కీర్తనలను పాడించాలని అధికారులకు సూచించారు. ట్రిపుల్ ఐటీతోపాటు ఇతర ఉన్నత చదువులకు తమవంతు సహకారం అందిస్తామన్నారు.
అంతకుముందు ఎస్వీ బాలమందిరంలో ప్రార్థనామందిరం, వంటశాల, అన్నప్రసాదాల నాణ్యత, మరుగుదొడ్లు, వసతిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాలమందిరంలోని సిబ్బందిని ఛైర్మెన్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి భారతి, ఏఈవో శ్రీమతి తామరసెల్వి, సూపరెంటెండెంట్ శ్రీ సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.