SV HIGH SCHOOL SHOULD BECOME A ROLE MODEL IN INDIA-TTD EO _ దేశంలోనే ఉత్త‌మంగా ఎస్వీ ఉన్నత పాఠ‌శాల అభివృద్ధి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

READY TO IMPART QUALITY EDUCATION TO 2500 STUDENTS OF TTD-GOUTAM SINGHANIA

HISTORIC INITIATIVE ON GURU POORNIMA DAz 

TIRUMALA, 13 JULY 2022 With the Singhania Group of Schools coming forward to revive academics by imparting quality education techniques, the TTD-run SV High School in Tirumala would definitely become a role model institution not only in the state of Andhra Pradesh but in the country, asserted TTD EO Sri AV Dharma Reddy.

Addressing the Parents’ – Teachers meeting held at the school premises in Tirumala on Wednesday, the EO said,  the Singhania Group of Schools have bagged numerous awards, and has received wide recognition across the country and also overseas for its emphasis on Inclusive Education, Faculty Competence, Innovations in Pedagogy and Assessments, Parenting, Sports and Culture.

The EO said, the Singhania Group of Schools are considered to be the best in imparting quality education to the pupils in the country and expressed his confidence that the SV High school which has a good infrastructure and ambience will soon become equally best in academics too with their intervention. Adding further the EO said, this historic initiative which will change the future of the children of the locals has been mulled on the auspicious day of Guru Poornima today with the benign blessings of Srivaru, he observed.

In his speech, the Chairman and the Managing Director of the Singhania Group of Industries Sri Gautam Singhania said the idea of commencing schools started after the demise of Smt Sulochana Devi about 52 years ago in an accident. “We have started giving quality education to the children of our employees initially. Today we are imparting quality education to nearly 20thousand pupils a year and our target is to make it to 100 thousand. Our endeavour is to prepare our students for the new world by building skill sets, focusing on the right attitude, working on competencies and learning outcomes is a way of life. Our schools have been winning International Awards for Excellence in Education in a row from the past five years”, he maintained.

“We are ready to impart quality education to the children of TTD educational institutions and consider this as an opportunity given by Sri Venkateswara Swamy to begin with in SV High School. Being an ardent devotee of Srivaru, we are blessed to associate ourselves with the construction of Srivari temple coming up at Mumbai for which the Bhoomi Puja will be performed during August this year”, he added.

Earlier, Sri Singhania attended the pooja performed on the occasion and later inaugurated the computer lab. He also planted a jasmine tree in the school premises and distributed the chocolates to the children. 

Tirumala temple Chief Priest Sri Krishna Seshachala Deekshitulu, Archaka Sri Kiran Swamy, Director of Singhania Group of Schools, Smt Revathi Srinivasan, JEO (H & E) Smt Sada Bhargavi, DEO Sri Govindarajan, DyEO Sri Rama Rao, Principal of the School Sri Krishnamurthy, Singhania Group representatives were present.

Among other officials, SE 2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, EE Sri Jaganmohan Reddy, DE Sri Ravishankar Reddy, Estates Wing Special officer Sri Mallikarjuna, VGO Sri Bali Reddy, teachers, students and their parents were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దేశంలోనే ఉత్త‌మంగా ఎస్వీ ఉన్నత పాఠ‌శాల అభివృద్ధి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

– గురుపూజ దినోత్స‌వం నాడు ఈ కార్య‌క్ర‌మానికి నాంది

– సింఘానియా ట్ర‌స్టు స‌హ‌కారంతో అత్యుత్త‌మ బోధ‌నా ప్ర‌మాణాలు : శ్రీ గౌతం సింఘానియా

తిరుమల, 2022 జులై 13: శ్రీ‌వారి పాదాల చెంత గ‌ల ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌ను సింఘానియా ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు స‌హ‌కారంతో రాష్ట్రంలోనే గాక దేశంలోనే అత్యున్న‌త‌మైన విద్యాసంస్థ‌ల్లో ఒక‌టిగా తీర్చిదిద్దుతామ‌ని, గురుపూజ దినోత్స‌వం రోజు ఈ కార్య‌క్ర‌మానికి నాంది ప‌లక‌డం సంతోష‌క‌ర‌మ‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల ప్రాంగ‌ణంలో బుధ‌వారం ఉపాధ్యాయులు, విద్యార్థుల త‌ల్లిదండ్రుల స‌మావేశం జ‌రిగింది.

 ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌లలోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌లో చ‌క్క‌టి మౌలిక స‌దుపాయాలు ఉన్నాయ‌ని, ఇక్క‌డ ఉన్న‌త‌మైన ప్రమాణాల‌తో కూడిన విద్య అందుతోంద‌ని, విద్యార్థులు మంచి ప్ర‌తిభ క‌న‌బరుస్తున్నార‌ని చెప్పారు. తిరుమ‌ల‌కు విచ్చేసే ప్ర‌ముఖులు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ముందుగానీ, త‌రువాత గానీ ఈ పాఠ‌శాల‌ను సంద‌ర్శించాల‌ని కోరారు. రేమాండ్స్ గ్రూపు ఆధ్వ‌ర్యంలో పేద విద్యార్థుల కోసం ప‌లు ప్రాంతాల్లో పాఠ‌శాల‌లు నిర్వ‌హిస్తున్నార‌ని, వీటిలో దేశంలోనే అత్యుత్త‌మ నాణ్య‌త ప్ర‌మాణాలను పాటిస్తున్నార‌ని చెప్పారు. ఇందుకోసం సింఘానియా పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ‌మ‌తి రేవ‌తి శ్రీ‌నివాస‌న్ ప‌లు రాష్ట్ర‌ప‌తి అవార్డులు సైతం అందుకున్నార‌ని వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌ను అక‌డ‌మిక్స్ ప‌రంగా అభివృద్ధి చేయాల‌ని శ్రీ గౌత‌మ్ సింఘానియాను కోర‌గా స‌మ్మ‌తించార‌ని తెలిపారు. సింఘానియా ట్ర‌స్టు పాఠ‌శాల‌ ఉపాధ్యాయుల‌కు నైపుణ్య శిక్ష‌ణ అందిస్తుంద‌ని, విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో త‌ర‌చూ స‌మావేశాలు నిర్వ‌హించి విద్యార్థుల ప్ర‌గ‌తిని చ‌ర్చిస్తార‌ని చెప్పారు. పాఠ‌శాల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులను టిటిడి క‌ల్పిస్తుంద‌న్నారు. భ‌గ‌వంతుడు అంద‌రినీ ఒకేవిధంగా సృష్టించార‌ని, ఎవ‌రికైతే మంచి శిక్ష‌ణ అందుతుందో వారు రాణించ‌గ‌లుగుతార‌ని చెప్పారు.

రేమండ్స్ గ్రూపు సిఎండి శ్రీ గౌత‌మ్ సింఘానియా మాట్లాడుతూ ముంబ‌యిలో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించే అపూర్వ‌మైన అవ‌కాశం త‌మకు ద‌క్కింద‌ని, ఈ అవ‌కాశం ఇచ్చిన టిటిడి బోర్డుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 47 సంవ‌త్స‌రాలుగా తాను తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తున్నాన‌ని, తిరుమ‌ల యాత్ర‌ త‌న జీవితంలో ఒక భాగంగా మారింద‌ని చెప్పారు. 52 ఏళ్ల క్రితం అప్ప‌టి రేమండ్ గ్రూప్ ఛైర్మ‌న్ స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి సులోచ‌నాదేవి సింఘానియా కెన‌డాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందార‌ని, ఆ స‌మ‌యంలో ప్ర‌మాద ఇన్సూరెన్స్ మొత్తం ఒక ల‌క్ష రూపాయ‌లు అందింద‌ని చెప్పారు. అయితే వారి కుటుంబ స‌భ్యులు ఈ మొత్తాన్ని ఏదైనా ఒక సామాజిక హిత కార్య‌క్ర‌మానికి ఖ‌ర్చు పెట్టాల‌ని కోరార‌న్నారు. ఈ విధంగా ఒక ల‌క్ష రూపాయ‌ల మూల‌ధ‌నంతో సులోచ‌నా దేవి సింఘానియా పాఠ‌శాల‌ స్థాప‌న ప్రారంభ‌మైంద‌న్నారు. సులోచ‌నా దేవి సింఘానియా ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో సుమారు 20 వేల మంది విద్యార్థులు చ‌దువుతున్నార‌ని, ప్రిన్సిపాల్ శ్రీ‌మ‌తి రేవ‌తి శ్రీ‌నివాస‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ పాఠ‌శాల ప్ర‌గ‌తి ప‌థంలో న‌డుస్తోంద‌ని చెప్పారు.

 త‌మ గ్రూపున‌కు సంబంధించిన ఫ్యాక్ట‌రీలు ఉన్న ప్రాంతంలో కార్మికుల పిల్ల‌ల కోసం మొద‌ట‌గా ఈ పాఠ‌శాల‌ను ప్రారంభించిన‌ట్టు తెలిపారు. ఇక్క‌డ మంచి విద్య‌ను అందించి కార్మికుల పిల్ల‌లను ఉన్న‌తస్థానాల‌కు చేర్చుతున్న‌ట్టు చెప్పారు. ఏడాదికి ల‌క్ష మంది పిల్ల‌ల‌కు విద్య‌ను అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, ఇందులో భాగంగా నెల రోజుల వ్య‌వ‌ధిలో ఈ పాఠ‌శాల‌తో క‌లిపి 5 పాఠ‌శాల‌ల్లోని సుమారు 20 వేల మందికి విద్య‌ను అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని అన్నారు. విద్య‌ద్వారా మంచి పౌరుల‌ను త‌యారుచేసి జాతి నిర్మాణంలో భాగ‌స్వాముల‌ను చేస్తామ‌న్నారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన ఉత్త‌మ పాఠ‌శాల‌లుగా సింఘానియా పాఠ‌శాల‌ల‌కు గుర్తింపు ద‌క్కింద‌న్నారు. మొద‌ట‌గా ఎస్వీ ఉన్న‌త‌ పాఠ‌శాల‌ను విద్యప‌రంగా అభివృద్ధి చేస్తామ‌ని, ఆ త‌రువాత టిటిడిలోని ఇత‌ర పాఠ‌శాల‌ల‌ను కూడా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు.

శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు మాట్లాడుతూ తాను  ఈ పాఠ‌శాల విద్యార్థినేన‌ని చెప్పారు. విన‌యంతో కూడిన విద్య అవ‌స‌ర‌మ‌ని, స్వామివారి ఆశీస్సుల‌తో విద్యార్థులంద‌రూ వృద్ధి చెందాల‌ని కోరారు.

ముందుగా ఈఓ శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ గౌతం సింఘానియా క‌లిసి పాఠ‌శాల‌లో పూజ‌లు నిర్వ‌హించి కంప్యూట‌ర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంత‌రం పాఠ‌శాల ప్రాంగ‌ణంలో సంపంగి మొక్క‌లు నాటారు.

ఈ కార్య‌క్రమంలో టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి,  ద్యాశాఖాధికారి శ్రీ గోవింద‌రాజ‌న్‌, డెప్యూటీ ఈవో శ్రీ రామారావు, సింఘానియా ట్ర‌స్టు పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ‌మ‌తి రేవ‌తి శ్రీ‌నివాస‌న్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ప్ర‌ధానోపాధ్యాయులు శ్రీ కృష్ణ‌మూర్తి, సింఘానియా ట్ర‌స్టు ప్ర‌తినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.