SV MUSEUM IN TML TO DON A NEW LOOK FOR BTUs_ భ‌క్తుల‌కు ఆధ్యాత్మిక అనుభూతి పెంచేలా ఎస్వీ మ్యూజియం అభివృద్ధి : టిటిడి

Tirumala, 12 Sep. 19: Sri Venkateswara Museum in Tirumala is all set to don a new look for the ensuing annual brahmotsavams, said TTD EO Sri Anil Kumar Singhal.

A review meeting on the development of SV Museum was held in the chambers of TTD EO in Tirupati on Thursday. The EO directed the officials concerned the revival of the museum with advanced 3D virtual image technology should give a complete new look and feel to the multitude of visiting pilgrims to Tirumala.

He instructed the engineering wing officials to take up the civil and electrical works to match the elegance.

Earlier, the Chief Museum Officer Col.Chandrasekhar Manda presented a power point and explained the master plan, which is under offing. He said the 3D Augmentation Technology will highlight Golla Mandapam, Mahadwaram, Vendi Vakili, Bangaru Vakili, Sabera, Vakulamata Sannidhi, Yagashala, Tulabharam etc. the prime historical areas associated with Tirumala temple which will be set in the ground floor.

Bengaluru based MAP firm has come forward to set up this new technology on donation basis for TTD.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భ‌క్తుల‌కు ఆధ్యాత్మిక అనుభూతి పెంచేలా ఎస్వీ మ్యూజియం అభివృద్ధి : టిటిడి

సెప్టెంబరు 12, తిరుమ‌ల‌, 2019: తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మ‌రింత పెంచేలా ఎస్వీ మ్యూజియంలో మాస్ట‌ర్‌ప్లాన్ అమ‌లు చేస్తున్నామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో గురువారం ఈవో మ్యూజియం అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మాస్ట‌ర్‌ప్లాన్ ప‌నుల‌పై రూపొందించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్‌ను చీఫ్ మ్యూజియం అధికారి క‌ల్న‌ల్ మండ చంద్ర‌శేఖ‌ర్ వివ‌రించారు. ఇందులో శ్రీ‌వారి ఆల‌యాన్ని ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శించిన అనుభూతి పొందేలా వ‌ర్చువ‌ల్ రియాలిటి 3డి ఆగుమెంటేష‌న్ టెక్నాల‌జీతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాట్లు చేయ‌నున్నారు. గొల్ల‌మండ‌పం, మ‌హ‌ద్వారం, తులాభారం, రంగ‌నాయ‌కుల మండ‌పం, ధ్వ‌జ‌స్తంభం, వెండివాకిలి, బంగారు వాకిలి, గ‌రుడాళ్వార్‌, గ‌ర్భాల‌యం, వ‌కుళామాత స‌న్నిధి, యాగ‌శాల‌, విమాన వేంక‌టేశ్వ‌ర‌స్వామి, స‌బేరా, భాష్య‌కార్లు, శ్రీ యోగ‌న‌ర‌సింహ‌స్వామి, శ్రీ వ‌ర‌ద‌రాజ‌స్వామి, పోటు, క‌ల్యాణ‌మండ‌పం త‌దిత‌ర ప్ర‌దేశాల‌ను ఇందులో వీక్షించే అవ‌కాశం క‌ల్పిస్తారు. అదేవిధంగా, శ్రీ‌వారి నిత్య కైంక‌ర్యాలు, వాహ‌న‌సేవ‌ల విశిష్ట‌త‌, తిరుమ‌ల‌లోని తీర్థాలు విశిష్ట‌త‌ను తెలుసుకునేలా ఏర్పాట్లు చేప‌ట్ట‌నున్నారు.

మ్యూజియంలో గ్యాల‌రీల‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దేందుకు లైటింగ్‌, ఇత‌ర సివిల్ ప‌నుల‌ను చేప‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. బెంగ‌ళూరుకు చెందిన ఎంఏపి సిస్ట‌మ్స్ సంస్థ విరాళంతో ఈ ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లోపు వీటిని భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.