ఆరాధనోత్సవాల్లో అలరించిన సంగీత కార్యక్రమాలు


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆరాధనోత్సవాల్లో అలరించిన సంగీత కార్యక్రమాలు

మార్చి 13, తిరుపతి, 2018 ; తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలో జరుగుతున్న శ్రీ శ్యామశాస్త్రులు, శ్రీత్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాల్లో భాగంగా మంగళవారం గాత్ర, వాద్య సంగీత కార్యక్రమాలు అలరించాయి.

ముందుగా ఎస్వీ నాదసర్వ పాఠశాల డిప్లొమా విద్యార్థులు, సర్టిఫికేట్‌ కోర్సు విద్యార్థులతోపాటు శ్రీ కె.మునికుమార్‌ నాదస్వర వాద్యప్రదర్శన ఇచ్చారు. శ్రీ వై.పరమేశ్వరయ్య సంగీతోపన్యాసం చేశారు. అనంతరం పలు సంగీత కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, స్థానిక కళాకారులు పలు కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.

సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి గాత్రం, అధ్యాపకులు శ్రీమతి కె.వందన గాత్రం, శ్రీ కె.సుధాకర్‌ గాత్రం, శ్రీమతి బి.చిన్నమ్మదేవి గాత్రం, శ్రీఎల్‌.జయరామ్‌ గాత్రం, శ్రీమతి పూర్ణవైద్యనాధన్‌, శ్రీమతి ఎస్‌.శ్రీవాణి వయొలిన్‌ వాద్యప్రదర్శనలిచ్చారు. శ్రీ వై.వేంకటేశ్వర్లు భాగవతులు త్యాగయ్య జీవితంపై హరికథ వినిపించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.