SV MUSIC COLLEGE STUDENT SHINES AT NATIONAL YUVAJANOTSAVAM_ జాతీయ యువజనోత్సవాల్లో ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థిని ప్రతిభ

Tirupati, 23 February 2018: V Lakmi student of TTDs SV Music and Dance college bagged second prize by thrilling performances of her Venu Vadyam at the national yuvajanotsavam hosted by the Ranchi university, Jharkhand.

The first year B. Music student attended the national event with support of her teachers and won the coveted honor. In her feat Lakshmi was supported by Sri Harish onmrudangam and Sri Nagraj on Ghatam.

The TTD DEO Sri Ramachandra and principal of college Smt YVS Padmavati felicitated Kum Lakmi.

Speaking on the occasion the DEO said the TTD would extend all support to students to perform. Everyone shouts take lesson from Lakshmi achievement to strive and excel in performance and display his or her skills.

Among others Sri Anantakrishna, Sri Sudhakar, Sri Ramesh and SD Shankar of SV Music College participated.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జాతీయ యువజనోత్సవాల్లో ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థిని ప్రతిభ

ఫిబ్రవరి 23, తిరుపతి, 2018: జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన విశ్వవిద్యాలయాల జాతీయస్థాయి యువజనోత్సవాల్లో టిటిడికి చెందిన ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థిని వి.లక్ష్మీ వేణువాద్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి పొందింది.

వి.లక్ష్మీ ఎస్వీ సంగీత కళాశాలలో బి.మ్యూజిక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అధ్యాపకుల ప్రోత్సాహంతో ఎస్వీ విశ్వవిద్యాలయం తరఫున రాంచీలో యువజనోత్సవాలకు హాజరైంది. అక్కడ నిర్వహించిన వాద్య సంగీత పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. ఈ పోటీల్లో వాద్యప్రదర్శనకు మృదంగంపై శ్రీ హరీష్‌, ఘటంపై శ్రీ నాగరాజు సహకారం అందించారు. ఈ సందర్భంగా టిటిడి విద్యాశాఖాధికారి శ్రీ ఎం.రామచంద్ర, ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి కలిసి లక్ష్మీని శుక్రవారం కళాశాలలో అభినందించి సన్మానించారు. డిఇవో శ్రీ రామచంద్ర మాట్లాడుతూ లక్ష్మీని స్ఫూర్తిగా తీసుకుని ఇతర విద్యార్థులు బాగా సాధన చేసి ఇలాంటి పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని కోరారు. విద్యార్థిని విద్యార్థులకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ అనంతకృష్ణ, శ్రీ సుధాకర్‌, శ్రీరమేష్‌, ఎ.ఎస్‌.శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.