SVBC NEW CHIEF MEETS TTD BOARD CHIEF _ టీటీడీ చైర్మన్ ను కలిసిన ఎస్వీబీసీ చైర్మన్.
Tirumala, 5 Nov. 20: The new Chairman of Sri Venkateswara Bhakti Channel Sri Saikrishna Yachendra has formally met TTD Trust board chief Dr YV Subba Reddy in the later’s camp office at Tirumala on Thursday evening.
The TTD Chairman said, already all Spiritual programmes have received immense applause from.devotees across the globe and told him to take the programs to further level with more quality.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ చైర్మన్ ను కలిసిన ఎస్వీబీసీ చైర్మన్.
తిరుమల. 5 నవంబరు 2020: ఎస్వీబీసీ నూతన చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర గురువారం సాయంత్రం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీ యాచేంద్ర ను ఎస్వీబీసీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హిందూ ధార్మిక ప్రచారంలో ఛానల్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలని శ్రీ సుబ్బారెడ్డి శ్రీ సాయికృష్ణ కు సూచించారు. ఎస్వీబీసీ కార్యక్రమాలకు వీక్షకుల నుంచి వస్తున్న ఆదరణ మరింత పెంచేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. చానల్ ను ఇతర భక్తి చానళ్ల కు ధీటుగా తయారుచేయాలని, ఇందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.
టీటీడీ ప్రజాసబంధాల అధికారిచే జారీ చేయబడినది