SVBC TO ENHANCE ITS QUALITY-CHAIRMAN_ ఉన్న‌త‌మైన సాంకేతిక విలువ‌ల‌తో శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు : ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ రాఘ‌వేంద్ర‌రావు

Tirumala, 16 September 2018: The quality of programmes in SVBC will enhanced to further level with more finesse, said it’s Chairman Dr K Raghavendra Rao

Addressing media persons in media centre at RBRH 2 in Tirumala on Sunday evening, he said all the programs like Pujaku Velaye, Annamaiah Pataku Pattabhishekam, Samskrutam Nerchukundam etc. have been immensely attracting audience, he added.

The Chairman SVBC also said, advance technology will be introduced to have more quality in programs.

Special Invitee of TTD Board Sri Krishna said, very soon the dubbing Rights of Sri Ramanuja Serial, which became most popular in Tamil in the recent times in Telugu.

SVBC CEO Sri Nagesh Kumar, PRO Dr T Ravi were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఉన్న‌త‌మైన సాంకేతిక విలువ‌ల‌తో శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు : ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ రాఘ‌వేంద్ర‌రావు

సెప్టెంబరు 16, తిరుమల 2018: శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌ల‌ను 13 హెచ్‌డి కెమెరాల‌తో చిత్రీక‌రించి అత్యున్న‌త‌మైన సాంకేతిక విలువ‌ల‌తో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు చేస్తున్నామ‌ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఛైర్మ‌న్ శ్రీ రాఘ‌వేంద్ర‌రావు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ వాహ‌న‌సేవ‌ల చిత్రీక‌ర‌ణ‌కు రెండు జిమ్మీజిప్‌లు ఏర్పాటుచేశామ‌ని, గ‌రుడ‌సేవ నాడు మూడు జిమ్మీజిప్‌ల‌తో స్వామివారి వైభ‌వాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌ని తెలిపారు. ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌కు గాను తిరుమ‌ల‌లో 156 మంది, తిరుప‌తిలో 60 మంది సిబ్బంది ప‌ని చేస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌న్నింటినీ మిడియా సంస్థ‌ల‌కు క్లీన్‌ఫీడ్ అందిస్తున్న‌ట్టు తెలిపారు. శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌లేని కార్య‌క్ర‌మాల‌ను రికార్డింగ్ చేసి మీడియాకు అందించేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు. తిరుమ‌ల‌లోని మీడియా సెంట‌ర్‌లో విజువ‌ల్స్ అందుబాటులో ఉంచుతున్న‌ట్టు తెలిపారు. రాంభ‌గీచా వెనుక ప్ర‌త్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసుకుని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు అందిస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలను తెలుగుతోపాటు త‌మిళం, క‌న్న‌డం, హిందీ వ్యాఖ్యానాల‌తో అందిస్తున్న‌ట్టు వివ‌రించారు. ఎస్వీబీసీలో ప్ర‌సార‌మ‌వుతున్న సుప్ర‌భాతం, పూజ‌కు వేళాయె, భ‌క్తిగీత మాలిక‌, నేను-నాస్వామి త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌కు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌న్నారు.

టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్వీబీసీ త‌మిళ ఛాన‌ల్ ను ప‌ర్య‌వేక్షిస్తున్న శ్రీ శ్రీ‌కృష్ణ మాట్లాడుతూ ఛాన‌ల్‌కు త‌మిళ భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్నారు. శ్రీ వేలుకుడి కృష్ణ‌న్ ప్ర‌వ‌చ‌నాల‌ను 130 ఎపిసోడ్స్ చిత్రీక‌రించి ప్ర‌సారం చేస్తున్న‌ట్టు తెలిపారు.

మీడియా స‌మావేశంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ వెంక‌ట న‌గేష్ పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.