నాదనీరాజనం వేదికపై సాంస్కృతిక శోభ
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
నాదనీరాజనం వేదికపై సాంస్కృతిక శోభ
సెప్టెంబరు 16, తిరుమల 2018 ; శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరిగిన ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 5 నుండి 5.30 గంటల వరకు శ్రీమతి కె.ఈశ్వరమ్మ, శ్రీమతి కె.రవిప్రభ బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఎం.జయలక్ష్మి బృందం విష్ణుసహస్రనామం, ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు చోడవరానికి చెందిన శ్రీ సుదర్శనం సీతారామాచార్యులు ధార్మికోపన్యాసం చేశారు.
మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శృతిరవళి బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీమతి వి.శ్రీమాతాత్మిక బృందం నామసంకీర్తన, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో హైదరాబాద్‌కు చెందిన శృతిరవళి బృందం సంకీర్తనాలాపన, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వరంగల్‌కు చెందిన శ్రీమతి శ్రీ వేదవ్యాస శ్రీరామభట్టర్ భాగవతార్ హరికథ పారాయణం చేశారు.
అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో ఆదివారం ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు ఆదోనికి చెందిన పరిమళ వ్యాసరావు బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.