SVBC TO TELECAST EASY SANSKRIT LEARNING PROGRAMME-TIRUPATI JEO_ యువతలో భక్తిభావాన్ని పెంచేలా ఎస్వీబీసీలో కార్యక్రమాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 24 October 2017: Being the torch bearer of Hindu Sanatana Dharma, one of the top most priority of TTD is to preserve, protect and promote Vedas and Sanskrit and henceforth the Sri Venkateswara Bhakti Channel of TTD will telecast “Easy Sanskrit” learning programmes, said Tirupati JEO Sri P Bhaskar.

A review meeting on the programmes of SVBC was held in his chambers in TTD administrative building in Tirupati on Tuesday. Speaking on this occasion, the JEO said, SVBC should telecast this programme with the help of Rastriya Sanskrit Vidyapeeth for primary students and with Vedic Varsity for class 6-10 students.

He also said, the programmes should also telecast, sanatana dharma, bhajana sampradaya etc. so that they will have a wide reach among the masses.

RSVP Vice Chancellor Sri Muralidhara Sharma, CEO SVBC Sri Narasimha Rao, Publications Special Officer Dr T Anjaneyulu were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
యువతలో భక్తిభావాన్ని పెంచేలా ఎస్వీబీసీలో కార్యక్రమాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

అక్టోబరు 24, తిరుపతి, 2017: సనాతన ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేసేలా, యువతలో భక్తిభావాన్ని పెంచేలా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో మంగళవారం ఎస్వీబీసీ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సహకారంతో పిల్లలకు సులువుగా సంస్కృతాన్ని బోధించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేయాలన్నారు. ఎస్వీ వేద వర్సిటీ సహకారంతో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వేదాల సారాంశాన్ని తెలియజేసేలా కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని సూచించారు. సనాతన ధర్మ మూలాలను పిల్లలకు తెలిపేలా, టిటిడి ప్రచురించిన ప్రముఖ పుస్తకాల సారాంశాన్ని, స్ఫూర్తిదాయక కథలను నవతరానికి తెలియజేసేలా, భజన సంప్రదాయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలను రూపొందించాలన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య వి.మురళీధరశర్మ, ఎస్వీబీసీ సిఈవో శ్రీ ఎవి.నరసింహారావు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రాజెక్టు అధికారి శ్రీ రమణప్రసాద్‌, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా|| టి.ఆంజనేయులు, రామకృష్ణ మఠం, అరవింద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.