TEMPLE TO GET 250 NEW CCTVs FOR SURVEILLANCE SOON-TIRUMALA JEO_ భక్తుల భద్రత కోసం త్వరలో శ్రీవారి ఆలయంలో 250 సిసి కెమెరాలు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 24 October 2017: With an intention to upgrade the security cover to the hill temple of Lord Venkateswara, 250 high end CC cameras will be installed soon during the first phase, said Tirumala JEO Sri KS Sreenivasa.

After the weekly review meeting at Annamaiah Bhavan in Tirumala, the JEO speaking to media persons said, a team of experts from National Institute of Small Industries (NISI), Government of India have negotiated with the security officials of TTD. “Out of the 1400 CC cameras which are going to be installed soon in Tirumala, in the first phase 250 cameras will be set at vital points inside the Srivari temple by next month. The remaining will be taken up in the next phase”, he added.

The JEO said, to enhance the efficiency of activity and service delivery system, TTD will adopt e-office in totto by March 31 next. “In the first phase we have introduced this system in major departments which includes Temple, Annaprasadam, Health, Procurement and Warehousing. In the next phase another five departments are in the pipeline to ease the office activity”, he maintained.

Adding further the JEO said, to encourage employed and youth to participate in Srivari Seva, the 3-day and 4-day seva slots have been released on October 24 and they can participate in seva from November 2 onwards. For three-day seva, the service is from Friday to Sunday with education qualification of minimun Tenth standard and age between 25 years to 40 years while the four-day seva will be from Monday to Thursday with reporting on Sunday. The age limit for four-day seva is 18 years to 60 years.

CVSO Sri A Ravikrishna, FACAO Sri O Balaji, CE Sri Chandra Sekhar Reddy and HoDs of all departments were also present in the review meeting.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

భక్తుల భద్రత కోసం త్వరలో శ్రీవారి ఆలయంలో 250 సిసి కెమెరాలు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

అక్టోబరు 24, తిరుమల, 2017: భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల 250 సిసి కెమెరాలను 40 రోజుల్లోపు ఏర్పాటు చేస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఉదయం సీనియర్‌ అధికారులతో జెఈవో సమీక్ష సమావేశం నిర్వహిచారు.

అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో మొత్తం 1400 సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మొదటి విడతలో శ్రీవారి ఆలయంలో సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, ఇందుకోసం భారత ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఐఎస్‌ఐ(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌) ప్రతినిధులు పరిశీలన జరిపారని తెలిపారు. ఈ-ఆఫీస్‌ విధానం మొదటి దశలో తిరుమలలోని శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో కార్యాలయంలో విజయవంతంగా అమలవుతోందన్నారు. రెండో దశలో నవంబరు నెలాఖరుకు ప్రొక్యూర్‌మెంట్‌, వేర్‌హౌసింగ్‌, ఎస్‌ఇ-2, అన్నదానం, ఆరోగ్య విభాగాల్లో ఈ-ఆఫీస్‌ విధానాన్ని అమలుచేస్తామన్నారు. టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు 2018, మార్చి నెలాఖరుకు టిటిడిలో పూర్తిస్థాయిలో ఈ-ఆఫీస్‌ విధానం అమలయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.

అక్టోబరు 24న మంగళవారం శ్రీవారి సేవ 3 రోజులు, 4 రోజుల స్లాట్ల బుకింగ్‌ ప్రారంభమైందని, బుక్‌ చేసుకున్న భక్తులు నవంబరు 2వ తేదీ నుండి శ్రీవారి సేవకు రావాల్సి ఉంటుందని జెఈవో తెలిపారు. యువతకు, ఉద్యోగులకు ఈ స్లాట్లు అనుకూలంగా ఉంటాయని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 3 రోజుల సేవ శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఉంటుందని, ఈ స్లాట్‌లో సేవకు రావాలనుకున్న భక్తుల వయసు 25 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఉండాలని, పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని వివరించారు. 4 రోజుల సేవ సోమవారం నుంచి గురువారం వరకు ఉంటుందని, ఆదివారం ఉదయం 11 గంటలలోపు తిరుమలలోని సేవాసదన్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసు గలవారు ఈ సేవకు హాజరుకావచ్చని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.