TTD OFFICIALS GET CRASH COURSE IN CPR_ భక్తులకు విశేష సేవలు అందించేందుకు టిటిడి ఉద్యోగులకు సిపిఆర్‌పై అవగాహన – స్విమ్స్‌ సంచాలకులు డా|| టి.ఎస్‌.రవికుమార్‌

Tirupati, 20 January 2018: The TTD officials were given a crash course in operation of CPR (Emergency Trauma Medicare) by the Director of SVIMS Dr Ravi Kumar.

The TTD staff were trained in rendering first aid to the cardiac patients among the lakhs of devotees who throng the Tirumala hill shrine. The three day courses conducted at the Welfare wing of the TTD Admin bldgs concluded today.

Speaking on the ocassion Dr GS Ravi Kumar said nearly 405 TTD staff members were trained in the first aid tips to handle heart attackcases.He urged all the TTD staff to get full awareness and expereince in handling the CPR (Cardiac Pulvary Resistation) model to save the patient from brink of death.

He said the staff nursres and doctors were initially trained in the CPR and later they extended their knowledge to the TTD workers. The SVIMS was rendering super speciality serices to notonly TTD staff but also the citiens of Tirupati city.The refresher camps were organised at the direction of the TTD Executive Officer Sri Anil Kumar.

Among others DyEO of TTD welfare wing Smt Snehalata, SVIMS Chief of Anesthialogy Dr Alok Samanthrena, Dr Hemala, Dr Narasimha Reddy, Dr Sudhakar REddy, PRO and Dy Director Dr Y Venkararama Reddy, PR-Assistant Director Sri V Rajasekhar, SVIMS doctors and other staff participated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భక్తులకు విశేష సేవలు అందించేందుకు టిటిడి ఉద్యోగులకు సిపిఆర్‌పై అవగాహన – స్విమ్స్‌ సంచాలకులు డా|| టి.ఎస్‌.రవికుమార్‌

తిరుపతి, 2018 జనవరి 20: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం ప్రతిరోజూ లక్షలాదిగా విచ్చేసే భక్తులకు అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలందించేందుకు, గుండెనొప్పి ప్రథమ చికిత్సపై టిటిడి ఉద్యోగులకు అవగాహన కల్పించినట్లు స్విమ్స్‌ సంచాలకులు డా|| టి.ఎస్‌. రవికుమార్‌ తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శనివారం ముగిసింది.

స్విమ్స్‌ సంచాలకులు డా|| టి.ఎస్‌.రవికుమార్‌ మాట్లాడుతూ దాదాపు 405 మంది టిటిడి ఉద్యోగులకు గుండెనొప్పి ప్రథమ చికిత్సపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎవరైనా గుండెనొప్పితో ప్రాణాపాయస్థితిలో ఉంటే సిపిఆర్‌ (కార్డియో పల్మనరీ రెసిస్టేషన్‌)పద్దతి ద్వారా రోగిని ప్రాణపాయస్థితి నుండి కాపాడవచ్చని, ఉద్యోగులందరు దీనిపై అవగాహన పెంచుకోవాలని కోరారు. అపస్మారకస్థితిలో ఉన్నవారికి ప్రథమ చికిత్స అందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

స్విమ్స్‌ డాక్టర్లు, నర్సులకు సిపిఆర్‌పై శిక్షణ ఇచ్చి, వీరి ద్వారా రాబోవు 2-3 వారాలలో టిటిడి ఉద్యోగులందరికీ అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. స్విమ్స్‌లో ఆధునిక వైద్య పరికరాలతో తిరుపతి పురప్రజలకు, భక్తులకు విశేష సేవలందిస్తున్నట్లు తెలిపారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీఈవో శ్రీమతి స్నేహలత, స్విమ్స్‌ అనస్థీషియాలజి విభాగాధిపతి డా|| అలోక్‌ సమంత్రేన, డా|| హేమలత, వైద్యులు డా|| నర్సింహారెడ్డి, డా|| సుధాకర్‌రెడ్డి, ప్రజాసంబంధాల డెప్యూటీ డైరెక్టర్‌ డా|| వై.వెంకట్రామిరెడ్డి, ప్రజాసంబంధాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీ వి.రాజశేఖర్‌, స్విమ్స్‌ వైద్యులు, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.