HUGE RESPONSE TO ONLINE SALES OF TTD CALENDARS AND DIARIES_ ఆన్‌లైన్‌లో టిటిడి క్యాలెండర్లు, డైరీలకు విశేష ఆదరణ

Tirumala, 20 January 2018: The on-line sale of TTD calendars and Diaries have been receiving overwhelming response from pilgrims as so far over 40thousands were sold since its launch on December 7 last.

The postal department is playing a vital role in delivering the products booked on-line in time. Under the instructions of TTD EO Sri Anil Kumar Singhal, TTD launched the on-line sale of calendars and diaries so that the pilgrims can send them as a new year gift to their kin and kith spread across the country.

The cost of 12-sheet calendar is Rs.90 while the diary is Rs.120 with additional delivery charges.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఆన్‌లైన్‌లో టిటిడి క్యాలెండర్లు, డైరీలకు విశేష ఆదరణ

తిరుపతి, 2018 జనవరి 20: టిటిడి క్యాలెండర్లు, డైరీల ఆన్‌లైన్‌ బుకింగ్‌కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 40 వేల డైరీలు, క్యాలెండర్లను దేశం నలుమూలల నుంచి భక్తులు బుక్‌ చేసుకున్నారు.

ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న 12 పేజీల క్యాలెండర్‌, డైరీని భక్తులు బుక్‌ చేసుకునేందుకు మొదటిసారిగా ఆన్‌లైన్‌లో 2017, డిసెంబరు 7వ తేదీ నుంచి టిటిడి అందుబాటులో ఉంచింది. 12 పేజీల క్యాలెండర్‌ ధర రూ.90/-, పెద్ద డైరీ ధర రూ.120/-గా ఉంది. వీటిని నూతన సంవత్సరం కానుకగా తమ బంధువులకు, స్నేహితులకు పోస్టల్‌ ద్వారా పంపే అవకాశాన్ని టిటిడి కల్పించింది. భక్తులు ttdsevaonline.com వెబ్‌సైట్‌లో ”పబ్లికేషన్స్‌”ను క్లిక్‌ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు.

టిటిడి క్యాలెండర్లు, డైరీలు పోస్టల్‌ శాఖ ద్వారా ఇంటి వద్దకే వచ్చి చేరుతుండడంతో ఎక్కువ మంది భక్తులు ఉత్సాహంగా బుక్‌ చేసుకుంటున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.