SWARNA RATHOTSAVAM HELD _ వైకుంఠ ఏకాదశి నాడు వేడుకగా స్వర్ణరథోత్సవం
Tirumala, 25 Dec. 20: The procession of Swarna Ratham held in Tirumala on the day of Vaikuntha Ekadasi between 9am and 11am.
The golden chariot is pulled by women devotees including women employees of TTD with religious fervour.
The processional deities of Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi seated on the chariot took out celestial ride along the four-mada streets to bless the devotees who converged in the galleries.
The entire hills reverberated to the chanting of Govinda Namas.
TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Addl EO Sri AV Dharma Reddy, Board Members Sri DP Anantha, Dr Nischita, Sri Kumarguru, CVSO Sri Gopinath Jatti, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, VGO Sri Bal Reddy and others took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
వైకుంఠ ఏకాదశి నాడు వేడుకగా స్వర్ణరథోత్సవం
తిరుమల, 2020 డిసెంబరు 25: తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని తిరుమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. టిటిడి మహిళా ఉద్యోగులతోపాటు మహిళలు పాల్గొని రథాన్ని లాగారు. ఆలయ మాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని గ్యాలరీల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో మాడ వీధులు మారుమోగాయి.
శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పాలంకరణ
శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా చెరకుగడలు, పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారు.
డిసెంబరు 26న వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం
వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబరు 26న శనివారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్వామి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, డా.నిశ్చిత, శ్రీ కుమారగురు, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.