SWIPE CARDS TO TO BUY CALENDAR/DIARY _ స్వైపింగ్‌ ద్వారా టిటిడి క్యాలెండర్లు, డైరీలు కొనుగోలుకు అవకాశం

Tirupati, 27 December 2017: The TTD has rolled out comprehensive use of technology to facilitate the devotees to purchase calendars and diaries by swiping their credit and debit cards.TTD diaries and calendars are made available at book stalls across AP, in TTD information centers at Vijayawada, Visakhapatnam, Chennai, Bengalore, Delhi, Mumbai etc.

The TTD has fixed the prices of the 12 page calender cost at Rs.90, the big diary was priced at Rs.120 and small diary @Rs.90, Small and big calendars of Srivaru and Sri Padmavati at Rs.15 and Rs.10, and Telugu Panchangam Rs.20.

From December 7, the TTD has also offered sale of diaries and calendars online through its website www.ttdsevaonline.com and also organised tie up with Indian postal department for delivery with nominal charges. Devotees could book their diaries on the ‘Publications’ icon of the website and book them.

The TTD is also offering distribution of its products on regular mode through DDs for delivery by Indian Postal Department. Interested devotees should send their DDs to the above address ‘ C/o AEO, TTD Publications and Printing Department, Press Compound,K T Road, Tirupati.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్వైపింగ్‌ ద్వారా టిటిడి క్యాలెండర్లు, డైరీలు కొనుగోలుకు అవకాశం

డిసెంబరు 27, తిరుపతి, 2017 ; టిటిడి పుస్తక విక్రయశాలలతో పాటు అన్ని సమాచార కేంద్రాల్లోనూ భక్తుల సౌకర్యార్థం స్వైపింగ్‌ యంత్రాల ద్వారా క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు. క్యాలెండర్లు, డైరీలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.అన్ని ప్రాంతాల్లో భక్తులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు.

తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదురుగా, లడ్డూ కౌంటర్ల వద్ద, లేపాక్షి ఎదుట, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలల్లో, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది.

12 పేజీల క్యాలెండర్‌ ధర రూ.90/-, పెద్ద డైరీ ధర రూ.120/-, చిన్న డైరీ రూ.90/-, శ్రీవేంకటేశ్వరస్వామివారి పెద్ద క్యాలెండర్‌ ధర రూ.15/-, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్‌ రూ.15/-, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు కలిసి ఉన్న క్యాలెండర్‌ ధర రూ.10/-, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ ధర రూ.20/- గా టిటిడి నిర్ణయించింది.

ఆన్‌లైన్‌ బుకింగ్‌ :

12 పేజీల క్యాలెండర్‌, డైరీని భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా డిసెంబరు 7వ తేదీ నుంచి మొదటిసారిగా టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. నూతన సంవత్సర కానుకగా బంధువులకు, స్నేహితులకు పోస్టల్‌ ద్వారా పంపే అవకాశాన్ని టిటిడి కల్పించింది. భక్తులు ttdsevaonline.com వెబ్‌సైట్‌లో ”పబ్లికేషన్స్‌”ను క్లిక్‌ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డుల ద్వారా భక్తులు తమకు కావాల్సినన్ని క్యాలెండర్లు, డైరీలను బుక్‌ చేసుకోవచ్చు. నిర్ణీత వ్యవధిలో క్యాలెండర్లు, డైరీలు భక్తులకు చేరేలా పోస్టల్‌ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు గాను పోస్టల్‌ ఛార్జీలను భక్తులు చెల్లించాల్సి ఉంటుంది.

డిడి తీసి పంపితే చాలు :

టిటిడి క్యాలెండర్‌, డైరీలను పోస్టు ద్వారానూ భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ”సహాయ కార్యనిర్వహణాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు పే విధానం(పోస్టల్‌ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్‌, డైరీలను పంపడం జరుగుతుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.