TIRUMALA JEO ORIENTS V-DAY DEPUTATION STAFF _ వైకుంఠ ఏకాదశిని విజయవంతంగా నిర్వహించాలి : జెఈవో

Tirumala, 27 December 2017 : With just one day to go, Tirumala JEO Sri KS Sreenivasa Raju directed the officials and other staff members who are deputed for Vaikuntha Ekadasi and Dwadasi duties in Tirumala on Wednesday evening.The orientation to employees was held in Rama Raja Nilayam Rest House, where in the JEO directed the officials and staff members to execute their responsibilities with utmost discipline and devotion.

“Accommodation to all the Protocol VIPs including ministers, judges, MPs, MLAs, MLCs, IAS officers etc. have been clearly designated and their darshan entry points have also been clearly earmarked. The deputation officers in these places should ensure that there is no confusion in their allotment”, he maintained.

GHAT ROADS OPEN FROM MIDNIGHT OF DEC 28 TILL MIDNIGHT OF JAN 1:

The JEO also instructed the officers and staffs to inform the VIPs to make use of accommodation facility in Tirupati as the Ghat road remains open round the clock for five days starting from 00::00hours of December 28 till 00::00 hours of January 2.SE II Sri Ramachandra Reddy, VGO Sri Ravindra Reddy, GM Sri Sesha Reddy, DyEOs Sri Kodanda Rama Rao, Sri Harindranath, Sri Venugopal and other officers were also present.

SPECIAL FOOD AND WATER ARRANGEMENTS IN QUEUE LINES:

Heavy influx of pilgrims is being anticipated this year for Vaikuntha Ekadasi since it is occurring during the vacation season. “We have laid 2.35km queue line from Gogarbham junction to VQC 2 junction for the pilgrims. The Annaprasadam and health wings should provide food and water to the devotees in a continuous manner, who will be stranded in the queue lines of Narayanagiri Gardens and in the junctions. Mobile toilets have also been set up with enough light facility for the sake of the pilgrims”, he added.

TTD CANCELS DIVYA DARSHAN TOKENS

In view of heavy rush being anticipated for V-day, TTD has cancelled issuance of Divya Darshan tokens from midnight of December 27 till midnight of January 1 in the larger interests of the pilgrims.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైకుంఠ ఏకాదశిని విజయవంతంగా నిర్వహించాలి : జెఈవో

డిసెంబరు 27, తిరుమల, 2017 ; తిరుమలలో ప్రముఖంగా జరిగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని రామరాజ నిలయంలో బుధవారం రాత్రి వైకుంఠ ఏకాదశికి విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందితో జెఈవో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన విధులపై మార్గనిర్దేశనం చేశారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ పర్వదినాల్లో తిరుమలకు పెద్ద ఎత్తున విచ్చేసే భక్తులకు ఎలాంటి రాజీకి తావు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మంత్రులు, రాజ్యాంగపరమైన హోదాలోని ప్రముఖులకు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఏలకు, అఖిలభారత సర్వీసుల అధికారులకు, ఇతర ఉన్నతాధికారులకు కేటాయించిన ప్రాంతాల్లోనే బస కల్పించాలన్నారు. దర్శన టికెట్లపై ముద్రించిన మార్గాల ద్వారా శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ పర్వదినాల కారణంగా డిసెంబరు 27న అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు 5 రోజుల పాటు కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేసినట్టు తెలిపారు. ఈ 5 రోజుల పాటు 24 గంటల పాటు రెండు ఘాట్‌ రోడ్లు తెరిచి ఉంటాయన్నారు. తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని టిటిడి విశ్రాంతిగృహాల్లోనూ బస పొందే అవకాశముందని విఐపిలకు సమాచారం తెలియజేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీ వేణుగోపాల్‌, శ్రీ హరీంద్రనాథ్‌, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీనారాయణ యాదవ్‌ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.