TAKE A FIRM DECISION ON WOMEN WEARING FLOWERS IN TIRUMALA_ డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

Tirumala, 1 Mar. 19: The Dial your EO programme in Annamaiah Bhavan at Tirumala on Friday witnessed some interesting suggestions from pilgrim callers which were attended personally by TTD EO Sri Anil Kumar Singhal.

A caller from Chennai Smt Padmavathi brought to the notice of EO that when wearing flowers are banned in Tirumala as all flowers are dedicated only in the service of Lord, then why is TTD allowing to sell flowers in Tirumala by vendors. “A married Hindu woman believes that wearing sindhoor, flowers as sentimental. But when it is banned, TTD should not allow sale of flowers. Please take some initiative”, for which the EO said her suggestion is well taken.

Another caller Sri Sridhar from Chirala suggested EO to display correct time while releasing compartments. He also suggested EO to give announcements in different languages during releasing time for better understanding of devotees. Reacting to the called the EO said he will ensure soon.

A caller Smt Aswini from Bengaluru said whether there is availability of Vastram ticket in online to which EO replies it is available only under lucky dip lottery system in Tirumala.

Sri Nandagopal from Pondicherry soght EO to select only trained teams to perform during vahanam procession to which EO said selection is done on transparent basis.

JEOs Sri KS Sreenivasa Raju, Sri B Lakshmikantham, CVSO Sri Gopinath Jatti, CE Sri Chandrasekhar Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

తిరుమల, 01 మార్చి 2019: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ :

– హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రూ.28 కోట్లతో నిర్మించిన శ్రీవారి ఆలయం, శ్రీమహాగణపతి ఆలయాల్లో మార్చి 13న విగ్రహప్రతిష్ఠ జరుగనుంది.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మో త్సవాలు :

– కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 18న శ్రీసీతారాముల కల్యాణం జరుగనుంది. ఈ కల్యాణానికి లక్ష మందికిపైగా భక్తులు విచ్చేసేఅవకాశముండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నాం.

తిరుమలలో ఉత్సవాలు :

– మార్చి 16 నుండి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగుతాయి.

నూతన శ్రీవారి సేవ భవన సముదాయాలు :

– తిరుమలలోని నూతనంగా నిర్మించిన శ్రీవారి సేవ భవన సముదాయాలను ఫిబ్రవరి 22వ తేదీ నుండి శ్రీవారి సేవకులకు అందుబాటులోకి తీసుకురావడమైనది.

– మొత్తం రూ.96 కోట్ల వ్యయంతో మహిళాసేవకుల కోసం సేవాసదనం-1, పురుష సేవకుల కోసం సేవాసదనం-2 భవనాలను ఆధునిక వసతులతో నిర్మించాం. ఒక్కో భవనంలో దాదాపు 2 వేల మంది బస చేయవచ్చు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు :

– శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 24న ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయి.

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు :

– తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 6వ తేదీ వరకు జరుగుతాయి.

ప్రత్యేక దర్శనాలు :

– మార్చి 5, 12వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తాం.

– మార్చి 6, 13వ తేదీల్లో 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.

దర్శనం :

– గతేడాది ఫిబ్రవరిలో 17.90 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 18.87 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది ఫిబ్రవరిలో రూ.82.27 కోట్లు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.83.11 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది ఫిబ్రవరిలో 36.04 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 42.64 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూ లు :

– గతేడాది ఫిబ్రవరిలో 75.18 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 82.06 లక్షల లడ్డూలను అందించాం.

రథసప్తమినాడు సేవలందించిన సిబ్బందికి అభినందనలు : ఈవో

తిరుమలలో ఫిబ్రవరి 12న జరిగిన రథసప్తమి పర్వదినం నాడు విశేషంగా విచ్చేసిన భక్తులకు మెరుగైన సేవలందించిన అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

కంపార్ట్‌మెంట్లలో భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ : ఈవో

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో అదనపు సిబ్బంది ద్వారా భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మరుగుదొడ్ల పరిశుభ్రత, వైద్యం తదితర వసతుల కల్పనకు భక్తులకు నిరంతరం ఈ సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.