టిటిడి కాల్ సెంటర్ ద్వారా భక్తులకు మరింత మెరుగైన సమాచారం – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
టిటిడి కాల్ సెంటర్ ద్వారా భక్తులకు మరింత మెరుగైన సమాచారం – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతి, 2019 మార్చి 01: టిటిడి కాల్ సెంటరలో అత్యాధునిక సాంకెేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా మరింత మెరుగైన సమాచారం అందించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం కాల్ సెంటర్ సిబ్బందిని ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో కాల్ సెంటర్ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి వస్తున్న కాల్స్‌కు వేగవంతంగా సమాచారం అందించాలన్నారు. టిటిడి కాల్ సెంటర్‌లో టిటిడిలోని అన్ని విభాగాల డైనమిక్ డాటాను ఎప్పటికప్పుడు క్రోడికరించుకోవాలన్నారు. తద్వారా భక్తులు పలు విభాగాల సమాచారం అడిగినప్పుడు సులభంగా సమాచారం అందించవచ్చన్నారు. అదేవిధంగా తాజా సమాచారంను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. భక్తుల నుండి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు లేదా సలహాలు వచ్చినప్పుడు సంబంధిత విభాగపు అధికారి వెంటనే స్పందించేలా ఇంటిగ్రేటెడ్ కంప్లయింట్ రెస్పాంసివ్ సిస్టమ్‌ను మెరుగ్గా ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత విభాగాధిపతికి అలర్ట్ వచ్చేటట్లు అప్లికేషన్‌లో మార్పులు చేయాలన్నారు.
సప్తగిరి మాస పత్రిక చందాదారుల చిరునామా, ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడిలు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ పూర్తి చేయాలన్నారు. తద్వారా సకాలంలో సప్తగిరి మాస పత్రికను పాఠకులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఐ.టి.విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, కాల్ సెంటర్ ఏఈవో శ్రీ ఆనందరాజు, ఇడిపి ఒఎస్‌డి శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, కాల్ సెంటర్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.