TALLAPAKA ANNAMACHARYA JAYANTHI UTSAVAMS _ ఏప్రిల్ 29 నుండి మే 5 తేదీ వరకు శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు
Tirupati, 25 April 2018 ; The 610 Jayanthi festival of Saint Poet Sri Tallapaka Annamacharya will be observed in a big way by TTD at Tallapaka and Tirupati from April 29 to May 05.
In Tallapaka, the home turf of the saint poet, special devotional programmes, Sapthagiri Sankeertanalu, Harikatha have been arranged by the Annamacharya Project of TTD at 108 feet statue of Annamacharya, while in Tirupati, at Annamacharya Kalamandiram.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI
ఏప్రిల్ 29 నుండి మే 5 తేదీ వరకు శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు
తిరుపతి,25 ఏప్రిల్ 2018 ; సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 610వ జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 29 నుండి మే 5 తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తాళ్లపాకలో..
కడప జిల్లా తాళ్లపాకలోని ధ్యానమందిరంలో ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 9.00 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మొదటగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు మరియు స్థానిక కళాకారులచే సప్తగిరి సంకీర్తన, గోష్ఠిగానం సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు గాత్ర సంగీత, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేది సాయంత్రం గాత్రసంగీతం, హరికథ జరుగనుంది. మే 1వ తేదిన ఉదయం 8 నుండి 9 గంటల వరకు నాదస్వర సమ్మేళనం, 9 నుండి 10 గంటల వరకు సప్తగిరి సంకీర్తన గోష్టిగానం, 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి కల్యాణం, సాయంత్రం సంగీత సభలు, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఏప్రిల్ 29, 30, మే 1వ తేది వరకు సంగీత, నాటక, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుపతిలో..
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానంతో జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి మరియు బృందంచే గాత్ర సంగీత కార్యక్రమం, రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీకృష్ణ నాట్యాలయ బృందం వారిచే నృత్య కార్యక్రమం జరుగనుంది. ఏప్రిల్ 30, మే 1వ తేదిలలో ఉదయం 10.30 నుండి 1 గంట వరకు సాహిత్య సదస్సులు జరుగనున్నాయి. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 2, 3, 4, 5 తేదీలలో గాత్రం, నృత్యం, హరికథ తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి.
మహతి కళాక్షేత్రంలోనూ ఏప్రిల్ 29 నుండి మే 5వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.