TALLAPAKA ANNAMAIAH STATUE TO GET A NEW LOOK _ అన్న‌మ‌య్య 108 అడుగుల విగ్ర‌హం వ‌ద్ద శ్రీ‌వారి ఆల‌య నిర్మాణం

SRIVARI TEMPLE AT TALLAPAKA- TTD CHAIRMAN

 

Tirupati, 01 April 2022: TTD Chairman Sri YV Subba Reddy said on Friday visited the 108 feet statue of saint poet Sri Tallapaka Annamacharya in YSR Kadapa district.

 

The Chairman who inspected the massive statue along with officials of TTD said that the entire area will be developed with devotee friendly amenities as a tribute to patriarch of Telugu devotional Sangeet, Sri Annamacharya who penned over 32,000 sankeertans. He said the 108 feet statue was installed in 2008 during the regime of late AP CM Sri YS Rajasekhara Reddy when Sri B Karunakar Reddy was the TTD Board Chairman.

 

He said to revive past glory, TTD has plans to develop landscape and also organise devotional music fetes and cultural programs daily besides building Sri Venkateswara temple in the corridors.

 

Similarly, TTD is also keen to develop Sri Sowmyanatha Swamy temple at Nandalur after government approval for its merger with TTD.

 

He said the historical Annamaiah margam will be developed expeditiously as a third ghat road for the sake of both foot walkers and vehicular traffic after approvals from the forest department.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్న‌మ‌య్య 108 అడుగుల విగ్ర‌హం వ‌ద్ద శ్రీ‌వారి ఆల‌య నిర్మాణం

తిరుపతి 1 ఏప్రిల్ 2022: శ్రీమాన్ తాళ్ళపాక అన్నమయ్య తిరుగాడిన ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామ‌ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.

ఇక్కడ భద్రత, అర్చకుడు, ఇతర సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించామన్నారు. వాస్తు ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రతిరోజు ఇక్కడ అన్నమయ్య సంకీర్తనలు వినిపించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

దివంగత ముఖ్య‌మంత్రి డాక్టర్ వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో, శ్రీ భూమన కారుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉన్న సమయంలో 2008లో అన్నమయ్య 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ ప్రాంగ‌ణంలోని అన్న‌మయ్య విగ్రహానికి రంగులు, నిత్య సంగీత కార్యక్రమాలు, ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించి భ‌క్తుల‌కు మ‌రింత ఆధ్యాత్మిక అహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఈ ప్రాంగ‌ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. తాళ్ళ పాకలో కూడా అభివృద్ధి పనులకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నంద‌లూరు సౌమ్యనాథ‌స్వామి ఆలయాన్ని ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత టిటిడిలో విలీనం చేసేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. అన్న‌మ‌య్య మార్గాన్ని సంప్రదాయబద్దంగా న‌డ‌క‌, వాహ‌నాలల్లో వెళ్ళేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు.
అంతకు ముందు శ్రీ సుబ్బారెడ్డి 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు. నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటి ఈవో శ్రీ రమణ ప్రసాద్, విజిఓ శ్రీ మనోహర్ ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.