TALLAPAKA GROUP OF TEMPLES ANNUAL BRAHMOTSAVAMS FROM JULY 11 TO JULY 20 _ తాళ్ళపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి మరియు శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయాల బ్రహ్మోత్సవాలు

TIRUPATI, JULY 2:  The annual brahmotsavams of Sri Chenna Keshava Swamy and Sri Siddheswara Swamy group of temples in Tallapaka which are under the aegis of TTD will be conducted from July 11 to July 20.  Ankurarpanam for this ten day mega religious fete will be celebrated on July 10 by the temple priests in a ceremonial way.


 TTD is making elaborate arrangements for the festival. The Hindu Dharma Prachara Parishad and other wings of TTD including Annamacharya Project and Dasa Sahitya Project have arranged special spiritual programmes like Harikatha, musical concert, Kolatam and other
programmes on this occasion.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తాళ్ళపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి మరియు శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయాల బ్రహ్మోత్సవాలు

 తిరుపతి, జూలై 02, 2011: జూలై 11 నుండి 20వ తారీఖు వరకు తితిదే ఆధ్వర్యంలో తాళ్ళపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి మరియు శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయాల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.

ఈ థాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని జూలై 10వ తారీఖున అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల నేపధ్యంలో తితిదే ఘనంగా ఏర్పాట్లను చేస్తున్నది.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతి రోజు హరికథ, భజన మరియు సంకీర్తనా కార్యక్రమాలను ఏర్పాటుచేసినది. అదేవిధంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే ప్రతి రోజు సాయంత్రం ఊంజల్‌సేవ సమయంలో అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినది. అదేవిధంగా తరిగొండ వెంగమాంబ సంకీర్తనల ఆలాపన, కోలాటం, భజనలు వంటి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను తితిదే ఏర్పాటు చేసినది.

తితిదేచే నిర్వహింపబడుతున్న డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరము నందు ప్రవేశానికి అర్హులైన వారిని ఎంపిక చేసి నోటీసు బోర్డులందు పెట్టడమైనది. పై కళాశాలలందు చేరగోరు విద్యార్థులు 04-07-2011 నుండి వచ్చి చూసుకొని కౌన్సిలింగ్‌నందు పాల్గొనవచ్చును. ఎస్‌.ఎస్‌.సి, ఇంటర్మీడియట్‌ ఇన్స్‌స్టెరట్‌ ఎగ్జామినేషన్స్‌ నందు ఉత్తీర్ణులైన విద్యార్థులకు 04-07-2011 నుండి 15-07-2011 వరకు తితిదేచే నిర్వహించబడుతున్న డిగ్రీ మరియు జూనియర్‌ కళాశాలలలో ధరఖాస్తులు ఇవ్వబడును. చేరగోరు విద్యార్థులు ఈ అవకాశమును ఉపయోగించుకోవచ్చును.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.