TANIKESAN GETS SARE FROM VENKATESWARA _ తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టిటిడి సారె

TIRUMALA, 09 AUGUST 2023: Following the tradition, TTD EO Sri AV Dharma Reddy offered silk vastrams to Sri Tanikesan, the chief deity of the famous Murugan temple in Tiruttani on the auspicious occasion of Adikrittika on Wednesday.

On his arrival to the temple, he was received by Temple Chairman Sri Sridharan and EO Sri Vijaya. Later the EO had the darshan of Sri Tanikesan.

This famous shrine of Lord Muruga, also known as Tanikesan is located on a small hillock in Tiruttani of Tamilnadu, about 50 kilometres from Tirupati. Tiruttani is considered to be one among six prime temples “Arupadaiveedu” dedicated to Lord Muruga. It is believed that Lord Muruga married one of His consorts, Sri Valli, at this sacred place.

TTD has been offering the silk vastrams to the presiding deity as a gift from Sri Venkateswara Swamy on this important festival day since 2006.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టిటిడి సారె

తిరుమ‌ల‌, 2023 ఆగ‌స్టు 09: తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి బుధవారం సమర్పించారు. టీటీడీ ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్‌ శ్రీ శ్రీధరన్, ఈవో శ్రీ విజయా, ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు.

కాగా భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనది. ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి తన ఇరువురు దేవేరులలో ఒకరైన శ్రీ వళ్ళీని పరిణయం ఆడినట్లు పురాణ ప్రశస్త్యం. టిటిడి 2006 నుండి ఆడికృత్తికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తుంది.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పారుపత్తేదార్
శ్రీ తులసి ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చారిత్రక ప్రాశస్త్యం :

తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ”ఆరుపడైవీడు” లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.

ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపధ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడి కృత్తిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించడం విశేషం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.