TARIGONDA VENGAMAMBA IS A SYMBOL OF WOMEN EMPOWERMENT_ వెంగమాంబ గొప్ప ఉపాసకురాలు : శ్రీశ్రీశ్రీ అమృతానందజీ మహరాజ్‌

Tirumala, 28 April 2018: Matrusri Tarigonda Vengamamba stood as a symbol of Women Empowerment almost three centuries ago with her zeal and dedication, said, Vengamamba Project Co-ordinator Dr K J Krishnamurthy.

After paying floral tributes at Vengamamba Samadhi on the occasion of 288th Birth Anniversary of the great saint poetess in Tirumala on Saturday, he said, Vengamamba penned several literary works on Tirumala Venkateswara and Tarigonda Lakshmi Narasimha Swamy.

She pioneered Annaprasadam distribution in Tirumala and fondly called by the devotees as “Matrusri”. Today the Annaprasadam charity by TTD is continued after her impeccable services”, he recalled.

The successors of Vengamamba were also present.

VENGAMAMBA IS UNIQUE POETESS OF 18TH CENTURY

Describing the great works penned by Matrusri Tarigonda Vengamamba as masterpieces, Sri Amruthananda Swamy of Sri Ramakrishna Mutt in Bangalore said, she lived a rich spiritual life with her dedication in 18th Century.

In his religious discourse on Saturday evening in Narayanagiri Gardens on the occasion of 288th birth anniversary of the Saint Poetess, he said, Vengamamba had the unique distinction of having penned kristis on Sri Lakshmi Narasimha Swamy, Sri Venkateswara Swamy and on Sri Balakrishna.

Earlier unjal seva was performed to deities in Padmavathi Parinaya Mandapam amidst the rendition of Vengamamba Sankeertans by project artistes.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వెంగమాంబ గొప్ప ఉపాసకురాలు : శ్రీశ్రీశ్రీ అమృతానందజీ మహరాజ్‌

ఏప్రిల్‌ 28, తిరుమల 2018: శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గొప్ప ఉపాసకురాలని బెంగళూరుకు చెందిన శ్రీరామకృష్ణమఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అమృతానందజీ మహరాజ్‌ పేర్కొన్నారు. వెంగమాంబ 288వ జయంతి ఉత్సవాలు శనివారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ అమృతానందజీ మహరాజ్‌ అనుగ్రహభాషణం చేస్తూ శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని, శ్రీ వేంకటేశ్వరస్వామిని, శ్రీ బాలకృష్ణుడిని ఆరాధ్యదేవతలుగా వెంగమాంబ ఉపాసించారని తెలిపారు. వెంగమాంబ రచనలను సాక్షాత్తు శ్రీవారు అంగీకరించినట్టు వివరించారు. గోదాదేవి, వెంగమాంబ, మీరాబాయి భగవంతుడిని ఆరాధించిన విధానం ఒకే విధంగా ఉంటుందన్నారు. తిరుమలలో తుంబురు తీర్థం నుండి వచ్చే సమయంలో సాక్షాత్తు రామలక్ష్మణులు దారి చూపారని వెంగమాంబ తన రచనలో తెలియజేసిందన్నారు. 87 ఏళ్ల వయసులో శ్రీవారి ఆమోదంతో వెంగమాంబ సజీవ సమాధి అయ్యారని చెప్పారు. వెంగమాంబ చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఉపనిషత్తుల్లోని అంశాలను తెలుసుకోవచ్చన్నారు.

ఈ సందర్భంగా వెంగమాంబ రచన అయిన ”శ్రీభాగవతము, ద్వితీయ స్కంధము” గ్రంథాన్ని శ్రీశ్రీశ్రీఅమృతానందజీ మహరాజ్‌ ఆవిష్కరించారు. దీనిని ఆచార్య కె.జె.కృష్ణమూర్తి పరిష్కరించారు.

ముందుగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్టిగానం నిర్వహించారు. ఈ కీర్తనలు భక్తులను అలరించాయి.

వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి :

తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో శనివారం సాయంత్రం టిటిడి అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్‌వో శ్రీమతి సదాలక్ష్మి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, రీసెర్చి అసిస్టెంట్‌ డా|| సి.లత, ఎవిఎస్‌వోలు శ్రీ కూర్మారావు, శ్రీచిరంజీవులు ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి నృసింహ జయంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం చేపడతారు. శ్రీ యోగనరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు.

నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయనాంచారులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత శ్రీ యోగ నరసింహస్వామివారికి అభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.