TTD CHAIRMAN INSPECTS VQC COMPARTMENTS_ సర్వదర్శనం కాంప్లెక్స్‌లో టిటిడి ఛైర్మన్ తనిఖీలు
Tirumala, 28 April 2018: TTD Trust Board Chief Sri Putta Sudhakar Yadav inspected VQC 2 compartments on Saturday evening.
During his whirlwind inspection, the Chairman of TTD Trust Board interacted with pilgrims and instructed the officials concerned to solve the issues without any delay.
The Chairman inspected the luggage Counters, coffee, tea distribution mechanism in Sarva Darshanam Complex, releasing of compartments, working of lights and fans in the compartments etc. He instructed the concerned to set up proper sign boards for better information of the pilgrims.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
సర్వదర్శనం కాంప్లెక్స్‌లో టిటిడి ఛైర్మన్ తనిఖీలు
ఏప్రిల్ 28, తిరుమల 2018: టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్ శనివారం రాత్రి సర్వదర్శనం కాంప్లెక్స్‌లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ టోకెన్ల పరిశీలన, లడ్డూ టోకెన్ల మంజూరును పరిశీలించారు. భక్తులకు టి, కాఫి అందించేందుకు సిబ్బంది సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. భక్తులందరికీ అల్పాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు సులువుగా అర్థమయ్యేలా సూచికబోర్డులు ఏర్పాటుచేయాలన్నారు.
ఛైర్మన్ వెంట టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.