TEAM WORK TO MAKE ANNUAL FETE A GRAND SUCCESS – JEO _ సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి
సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి
– నారాయణవనం బ్రహ్మోత్సవాలపై జెఈవో శ్రీ వీరబ్రహ్మం సమీక్ష
తిరుపతి 11 మే 2022: నారాయణవనం లోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మే 13 నుండి 21వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను సమష్టి కృషితో విజయవంతం చేయాలని టీటీడీ జెఈవోశ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల నిర్వహణ పై అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, ఉత్సవాలలో 13వ తేదీ ధ్వజారోహణం, 17 వ తేదీ గరుడ వాహనం, 20వ తేదీ రథోత్సవం, మరియు కళ్యాణోత్సవం, 21వ తేదీ చక్రస్నానం ముఖ్యమైనవని అన్నారు.
రథం పరిస్థితి ఎలా ఉందో పరిశీలించి ట్రైల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. వాహన సేవల కోసం అవసరమైన తండ్లు, ఘటాటోపం సిద్ధంచేసుకోవాలన్నారు. అవసరమైన మేరకు స్కౌట్స్, శ్రీవారి సేవకులను సిద్ధం గా ఉంచుకోవాలని సూచించారు. పంచగవ్య ఉత్పత్తుల అమ్మకాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులకు అన్న ప్రసాదాల వితరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఆలయానికి అవసరమైన ఇత్తడి పాత్రలు, పోటు కార్మికులను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధర్మప్రచార పరిషత్ ద్వారా భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయాలన్నారు. డిప్యూటి ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో
శ్రీ దుర్గ రాజు, విజివో శ్రీ మనోహర్, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్, ఈఈ శ్రీ మనోహర్, విద్యుత్ విభాగం డిఈ శ్రీ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జెఈవో మాడవీధులను, ఇంజినీరింగ్ పనులను పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చలువ పందిల్లు వేయాలని అధికారులను ఆదేశించారు. తరువాత శ్రీ అవనాక్షమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది
TIRUPATI, 11 MAY 2022: Execute united efforts in coordination and make annual Brahmotsavams a grand success, directed by TTD JEO Sri Veerabrahmam.
As the annual fete is set to commence from May 13 in Narayanavanam, the JEO held a review meeting in the temple premises on Wednesday evening.
He said the important days includes Dhwajarohanam on May 13, Garuda Seva on May 17, Rathotsavam on May 20 and Chakra Snanam on May 21.
He also directed to do a trial-run of Ratham as the event is taking place after a gap of two years after Covid Pandemic.
The JEO also directed to keep ready enough number of volunteers, scouts and guides and security personnel.
He also instructed the concerned to make arrangements for Annaprasadam and other men and machinery required for temple activities. And carry out any pending engineering works.
Similarly, he also asked to plan devotional cultural programmes in more appealing manner.
Later he also inspected the ongoing works in the temple.
DyEO Smt Nagaratna, EE Sri Manohar, Additional HO Dr Sunil, DE Electrical Sri Chandrasekhar, AEO Sri Durgaraju and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI