TEMPLE CITY REVERBERATES WITH “RAMA-HANUMA” NAMA_ హనుమద్వాహనంపై శ్రీరాముడి తేజసం

Tirupati, 21 March 2018: The temple city of Tirupati reverberated with the devotees chanting Sri Rama-Hanuma nama on Wednesday.

On the sixth day of the ongoing annual brahmotsavams of Sri Kodanda Rama Swamy Temple in Tirupati, the Lord took celestial ride on Hanumantha Vahana.

The devotees made a bee-line to the temple to witness the grandeur of the two lords on the same day.

Among vahanas, it is Hanuman who is also equally revered as “Lord” by devotees. Lord Hanuman is a symbol of loyalty, total surrenderence, benevolent love towards His Master and hence being worshipped as Lord.

DyEO Smt Jhansi, Executive Engineer Sri Jagadeeswara Reddy, AVSO Sri Ganga Raju, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

హనుమద్వాహనంపై శ్రీరాముడి తేజసం

మార్చి 21, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. భజనలు, కోలాటాల నడుమ స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. కావున దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.

వాహనసేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వేడుకగా నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు గజవాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.

గజ వాహనం :

హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 7 నుండి 8 గంటల వరకు ధర్మగిరి వేద పాఠశాల ఆధ్వర్యంలో వేదపారాయణం నిర్వహించారు.

శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి బి.లక్ష్మీ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.