“I PRAYED THE LORD TO BESTOW THE STATE WITH PROSPERITY”- HON’BLE CM OF AP_ ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం – ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు
EXTENDS “SRI RAMANAVAMI” WISHES TO PEOPLE OF AP
Tirumala, 21 March 2018: The Honourable Chief Minister of Andhra Pradesh Sri N Chandra Babu Naidu said that he prayed Lord Venkateswara to bless the state of AP with happiness and prosperity.
The CM had darshan of Lord Venkateswara at Tirumala on Wednesday along with his family on the occasion of the Fourth Birth Day of his Grandson Chi Devansh. Later speaking to media persons outside temple, he said, that with the benign blessings of Lord Venkateswara he will strive hard for the overall development of the State of Andhra Pradesh and make it number one in all fields.
CM AND FAMILY MEMBERS WEAR “TIRUNAMA DHARANA”
Earlier the Honourable CM and the members of his family entered Srivari temple through Vaikuntham Queue Complex 1. The Srivari Seva volunteers applied “Tirunamam” to the CM and other members. Tirumala JEO Sri KS Sreenivasa Raju who accompanied the CM, explained him about the implementation of Tirunamadharana at different places in Tirumala. The CM appreciated TTD for the idea and services of Srivari Sevakulu.
“ISTHIKAPHAL” WELCOME
On his arrival at Mahadwaram, the Hon’ble CM was accorded with traditional “Isthikaphal” Swagatham by the temple religious staff amidst chanting of veda mantras accompanied by Melam and Mangala Vaidyam. TTD Executive Officer Sri Anil Kumar Singhal accorded warm welcome to the Head of the State.
CM WATCHES FUCTIONING OF RETRACTABLE ROOF
After the completion of darshan, when the CM and his entourage reached the open area between Dhwajastambham and Padikavili, he was explained by EO about the functioning of retractable roof.
VEDASIRVACHANAM AT RANGANAYAKULA MANDAPAM:
The vedic pundits rendered Vedasirvachanam to the CM and other members of his family at Ranganayakula Mandapam. Later the TTD EO presented silk vastrams, laddu and teertha prasadams to Honourable CM of AP, Minister Sri Nara Lokesh and Hindupuram Legislator Sri N Balakrishna. Sri Vilambi Nama Samvatsara Siddhanta Panchangam by TTD was also presented to them on this occasion.
Tirumala Sri Chinna Jiyar Swamy, DIG Sri Prabhakar Rao, Collector Sri Pradyumna, CVSO Sri A Ravikrishna, Tirupati Urban SP Sri Abhishek Mohanty, DyEO Sri Harindranath and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం – ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం
మార్చి 21, తిరుమల 2018: ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు ఆనందం, సుఖసంతోషాలు, మెరుగైన జీవనప్రమాణాలు ప్రసాదించాలని కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని ప్రార్ధించినట్లు ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. భక్తులకు, గౌ|| ముఖ్యమంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు తనకు శక్తి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. భక్తులకు, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
”తిరునామం” ధరించి సామాన్య భక్తులుగా వైకుంఠం క్యూ కాంపెక్స్‌లోకి ప్రవేశం
ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోనికి ప్రవేశించిన గౌ|| ముఖ్యమంత్రిని, కుటుంబ సభ్యులను శ్రీవారిసేవకులు భక్తిభావంతో గోవింద, గోవింద అని సంభోదిస్తు తిరునామధారణ చేశారు. ఈ సందర్భంగా తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు భక్తులకు తిరుమలలోని ప్రధాన ప్రాంతాలలో శ్రీవారిసేవకులతో తిరునామధారణ నిర్వహిస్తున్నట్లు గౌ|| ముఖ్యమంత్రికి వివరించారు. టిటిడి శ్రీవారిసేవకులతో తిరునామధారణ నిర్వహించడం చాలా బాగుందని గౌ|| ముఖ్యమంత్రి ప్రశంసించారు.
అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి గౌ|| ముఖ్యమంత్రి ఆలయంలోనికి ప్రవేశించారు. అక్కడ మహద్వారం వద్దకు చేరుకోగానే టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సాదరంగా ఆహ్వానించగా, ఆలయ అర్చకులు కలిసి సంప్రదాయబద్ధంగా ”ఇస్తికఫాల్” స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు.
ముడుచుకునే పైకప్పును పరిశీలించిన గౌ|| ముఖ్యమంత్రి
శ్రీవారి ఆలయంలో పడికావిలి నుండి ధ్వజస్తంభం మధ్య ఏర్పాటుచేసిన ముడుచుకునే పైకప్పు పనితీరును గౌ|| ముఖ్యమంత్రి పరిశీలించారు. ఎండకు, వర్షానికి భక్తులు ఇబ్బంది పడకుండా ఈ మేరకు ఏర్పాటు చేసినట్లు టిటిడి ఈవో వివరించారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో, తిరుమల జెఈవోలు కలిసి గౌ|| ముఖ్యమంత్రివర్యులకు, వారి కుటుంబసభ్యులకు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, శ్రీవిలంబినామ సంవత్సర టిటిడి పంచాంగం అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, రాష్ట్రమంత్రి వర్యులు గౌ|| శ్రీ నారా లోకేష్, హిందూపురం ఎమ్.ఎల్.ఏ. శ్రీ బాలకృష్ణ, డిఐజి శ్రీ ప్రభాకర్‌రావు, జిల్లా కలెక్టర్ శ్రీప్రద్యుమ్న, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, అర్చన్ ఎస్‌పి శ్రీ అభిషేక్ మహంతి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాధ్, విజివో శ్రీరవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.