TTD LOCAL TEMPLES CLOSED FOR LUNAR ECLIPSE_ చంద్రగ్రహణం కారణంగా జూలై 16న సాయంత్రం టిటిడి స్థానికాలయాల మూత

Tirupati, July 15, 2019: In view of Lunar eclipse on Tuesday all the TTD local temples at Tirupati, Tiruchanoor, Nagalapuram, Narayanavanam, Karvetinagaram etc will be closed on Tuesday, July 16 evening till Wednesday July 17 morning 6am.

The lunar eclipse will begin at 1.31 am and lasts upto 4.29 am of July 17 and temples ewill be closed six hours ahead of eclipse on July 16 and opened at 6 am of July 17.

TTD also announced closure of its Anna Prasadam Centre at all locations of Tirupati from July 16 evening 6 pm to morning of July 17.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

చంద్రగ్రహణం కారణంగా జూలై 16న సాయంత్రం టిటిడి స్థానికాలయాల మూత

తిరుపతి, 2019 జూలై 15: చంద్రగ్రహణం కారణంగా జూలై 16వ తేదీ మంగళవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేయనున్నారు. తిరిగి జూలై 17వ తేదీ బుధవారం ఉదయం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. జూలై 17వ తేది బుధ‌వారం ఉద‌యాత్పూర్వం 1.31 నుండి 4.29 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలను సాయంత్రం 4.30 గంటలకు మూసి మరుసటి రోజు ఉద‌యం 6 గంటలకు తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాన్ని రాత్రి 7 గంటలకు మూసి, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం ఉదయం 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆణివార ఆస్థానం నిర్వహిస్తారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను సాయంత్రం 7 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

నారాయణవనంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సత్రవాడలోని శ్రీ కరివరదరాజస్వామి ఆలయం, నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామి ఆలయాలను 16వ తేది సాయంత్రం 6.30 గంటలకు తలుపులు మూసి, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు తెరుస్తారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం తదితర సేవల అనంతరం 7 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

చంద్రగిరి శ్రీ కోదండరామాలయాన్ని జూలై 16న మధ్యాహ్నం 4 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 6.00 గంటలకు ఆలయాల తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయం, తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహ‌స్వామివారి ఆలయం, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆల‌యాల‌ను సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 6 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

తిరుపతిలో అన్నప్రసాద వితరణ కేంద్రాల మూత

చంద్రగ్రహణం కారణంగా జూలై 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు తిరుపతిలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, 2వ సత్రాలు, ఆసుపత్రులు, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం క్యాంటీన్‌లో అన్నప్రసాద వితరణ ఉండదు. జూలై 17వ తేదీ ఉదయం నుండి యధావిధిగా అన్నప్రసాద వితరణ ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.