TENCTEPLASE INJECTION FOR DEVOTEES FACILITATION IN TIRUMALA- ADDITIONAL EO _ భ‌క్తుల అత్య‌వ‌స‌ర వైద్యం కోసం టెనెక్టేస్ ప్ల‌స్ ఇంజ‌క్ష‌న్ విడుద‌ల

Tirumala, 7 Jan. 22: In yet another pilgrim caring move, TTD has unveiled Tencteplase injection that prevents cardiac arrests and acts as a life saviour.

The TTD Additional EO Sri AV Dharma Reddy released the critical drug at the Primary Health Centre near Ram Bagicha Rest House in Tirumala on Friday.

Speaking on the occasion the Additional EO said as per doctors’ the medicine provides instant relief to patients suffering from blood clots caused by cardiac arrests.

 

He said this life-saving drug project has been approved by ICMR only for the Ruia Hospital in entire south India. With Tirupati as headquarters, the crucial drug will be supplied to 13 regional hospitals around.

 

While these injections cost nearly Rs.35,000- Rs. 40,000 each in the open market, they are now freely made available by TTD for emergency treatment of needy devotees.

 

He said since the majority of devotees coming to Tirumala on foot are often subjected to heart attack threats, this drug will be of great use to such pilgrims. TTD in collaboration with the Apollo hospital has set up a special cardiac centre at Tirumala in addition to the availability of crucial medicine at the Ruia Hospital.

 

He expressed thanks to doctors of SV Medical College and Ruia Hospital for providing infrastructure for the new project and sought the Apollo hospital to provide training to the medical staff at Aswini hospital in Tirumala.

 

Dr Jaya Bhaskar, Principal SV Medical College Tirupati, said nine hospitals in the country have been sanctioned with the injection by the ICMR. The Ruia Hospital will supply these injections to selected PHCs and CHCs within 100 kms of Tirupati.

 

She said providing this injection within 2-3 hours of reaching hospitals will help in curing blot clots from happening and resume blood circulation before commencing regular treatment as acts as a saviour of life.

 

Dr Bharati, Medical Superintendent of Ruia Hospital TTD CMO Dr R.V.S Muralidhar, Cardiology Professor Dr Muniswar Reddy, SMO Dr AV Narmada, Ashwini Hospital Medical Superintendent Dr S Kusuma Kumari, and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భ‌క్తుల అత్య‌వ‌స‌ర వైద్యం కోసం టెనెక్టేస్ ప్ల‌స్ ఇంజ‌క్ష‌న్ విడుద‌ల

– గుండెపోటు నుండి ర‌క్ష‌ణ

– టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 07: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులకు అత్య‌వ‌స‌ర వైద్యం అవ‌స‌ర‌మైన ప‌క్షంలో గుండెపోటు నుండి ర‌క్షించేందుకు తిరుప‌తిలోని రుయా ఆసుప‌త్రివారి ఆధ్వ‌ర్యంలో టెనెక్టేస్ ప్ల‌స్ అనే ఇంజ‌క్ష‌న్ మందును అందుబాటులో ఉంచిన‌ట్టు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని రాంభ‌గీచా విశ్రాంతి గృహం వ‌ద్ద గ‌ల ప్ర‌థ‌మ చికిత్స కేంద్రంలో శుక్ర‌వారం అద‌న‌పు ఈవో ఈ మందును విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ గుండె ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డం లాంటి స‌మ‌స్య‌ల కార‌ణంగా గుండెపోటు వ‌చ్చిన‌ప్పుడు ఈ ఇంజ‌క్ష‌న్ వేస్తే వెంట‌నే ర‌క్ష‌ణ ల‌భిస్తుందని డాక్ట‌ర్లు చెప్పారన్నారు. దక్షిణ భార‌త‌దేశంలో రుయా ఆసుప‌త్రికి మాత్ర‌మే ఈ ప్రాజెక్టు మంజూరైంద‌ని తెలిపారు. తిరుప‌తి కేంద్రంగా చుట్టుప‌క్క‌ల 13 ప్రాంతాల్లో ఈ ఇంజ‌క్ష‌న్ అందుబాటులో ఉంటుంద‌న్నారు. మార్కెట్‌లో దీని ధ‌ర రూ.35 వేల నుండి రూ.40 వేల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పారు. రుయా ఆసుప‌త్రిలో దీన్ని ఉచితంగా అందిస్తారని వెల్ల‌డించారు. తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఇది ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌న్నారు. చాలా మంది భ‌క్తులు కాలిన‌డ‌కన మెట్ల మార్గంలో తిరుమ‌ల‌కు వ‌స్తుంటార‌ని, కొంతమంది గుండెపోటుకు గుర‌వుతున్నార‌ని చెప్పారు. ఈ కార‌ణంగానే అపోలో ఆసుప‌త్రి నుండి ప్ర‌త్యేక కార్డియాక్ సెంట‌ర్‌ను తిరుమ‌ల‌లో నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. దానికి తోడు రుయా ఆసుప‌త్రి నుండి ఈ ఇంజ‌క్ష‌న్ ఇవ్వ‌డానికి వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల భ‌క్తుల‌కు ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌న్నారు. ఇందుకు కృషి చేసిన ఎస్వీ మెడిక‌ల్ క‌ళాశాల, రుయా ఆసుప‌త్రి వైద్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ ఇంజ‌క్ష‌న్ వేయ‌డంపై అశ్వ‌నీ ఆసుప‌త్రి వైద్య‌సిబ్బందికి, అపోలో కార్డియాక్ సెంట‌ర్ సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వాల‌ని కోరారు.

ఎస్వీ మెడిక‌ల్ క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ జ‌య‌భాస్క‌ర్ మాట్లాడుతూ ఐసిఎంఆర్ ప్రాజెక్టు కింద దేశంలోని దేశంలోని 9 ఆసుప‌త్రుల‌కు ఈ ప్రాజెక్టుకు కేటాయించారని తెలిపారు. రుయా ఆసుప‌త్రికి వంద కిలోమీట‌ర్ల ప‌రిధిలోని పిహెచ్‌సిలు, సిహెచ్‌సిల‌ను ఎంపిక చేసుకుని ఇంజ‌క్ష‌న్ అందిస్తామ‌న్నారు. ఇందులో భాగంగా తిరుమ‌ల‌లోని అశ్వ‌నీ ఆసుప‌త్రిని ఎంపిక చేశామ‌ని, మ‌న రాష్ట్రం నుండే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుండి భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌స్తుంటారని చెప్పారు. అక‌స్మాత్తుగా గుండె పోటు వచ్చిన‌ట్ల‌యితే ఆసుప‌త్రికి చేరేలోపు 2, 3 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఈ లోపు గుండె కండ‌రాల‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఈ మెడిసిన్ వెంట‌నే ఇవ్వ‌గ‌లిగితే ర‌క్త‌నాళాల్లో ఏర్ప‌డిన గ‌డ్డ క‌రిగిపోయి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ తిరిగి ప్రారంభ‌మవుతుంద‌ని చెప్పారు. ఇంత‌లోపు ఆసుప‌త్రికి చేరితే వైద్యులు త‌ద‌నంత‌ర చికిత్స ప్రారంభిస్తార‌ని వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సిఎంఓ డాక్ట‌ర్ ఆర్వీఎస్.ముర‌ళీధ‌ర్‌, రుయా ఆసుప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ భార‌తి, ఎస్వీ మెడిక‌ల్ క‌ళాశాల కార్డియాల‌జి ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ మునీశ్వ‌ర్‌రెడ్డి, ఎస్ఎంవో డాక్ట‌ర్ ఎవి.న‌ర్మ‌ద‌, అశ్వ‌ని ఆసుప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ఎస్‌.కుసుమ‌కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.