ఆగస్టు 28న వస్త్రాలు టెండర్‌ కమ్‌ వేలం

ఆగస్టు 28న వస్త్రాలు టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2017 ఆగస్టు 23: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్‌షీట్లు, నాప్కిన్లు తదితర పలురకాల వస్త్రాలు 10 లాట్లకు(1,118 నంబర్లు) ఆగస్టు 28న టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయంలో ఈ వేలం జరుగనుంది.

వేలంలో పాల్గొనదలచినవారు రూ.500/- ఇఎండిగా చెల్లించాల్సి ఉంటుంది. ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ.100/- డిడి తీసి టెండర్‌ షెడ్యూల్‌ను పొందవచ్చు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, 0877-2264221 నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org ను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది