కడప జిల్లాలోని టిటిడి ఆనుబంధ ఆలయాల్లో పవిత్రోత్సవాలు
కడప జిల్లాలోని టిటిడి ఆనుబంధ ఆలయాల్లో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2017 ఆగస్టు 23: టిటిడి ఆధ్వర్యంలోని కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1 నుండి 3వ తేదీ వరకు, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 3 నుండి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 31వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 1వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 2న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 3న మహాపూర్ణాహుతి జరుగనున్నాయి. చివరిరోజు సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లవీధి ఉత్సవం నిర్వహిస్తారు.
దేవునికడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 3వ తేదీ సాయంత్రం విష్వక్సేనపూజ, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయ. సెప్టెంబరు 4వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 5న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 6న మహాపూర్ణాహుతి, పవిత్రవితరణ, వీధి ఉత్సవం జరుగనున్నాయి.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది