జూన్‌ 2న వస్త్రాలు టెండర్‌ కమ్‌ వేలం

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 29, తిరుపతి, 2018 తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను జూన్‌ 2వ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. ఇందులో కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 75 లాట్లు ఉన్నాయి.

ఆసక్తి గలవారు జూన్‌ 2వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ.2,000/- డిడి తీసి సీల్డ్‌ టెండర్‌తోపాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లు తెరుస్తారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.