ANNUAL BTUs OF SRI GT CONCLUDES WITH CHAKRASNANAM_ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి చక్రస్నానం

Tirupati, 29 May 2018: The annual brahmotsavams in Sri Govinda Raja Swamy temple concluded on a grand note with Chakrasnanam on Tuesday.

The processional deities of Lord and Goddesses along with Sri Sudrashana Chakrattalwar were taken to Alwar Tank in Kapilateertham.

Snapana Tirumanjanam was performed to deities in the Alwar Tank in a big way. Later in auspicious muhurat, Sudarshana Chakrattalwar was given holy dip in the waters of the temple tank.

Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, local temples DyEO Smt Varalakshmi, AEO Sri Udayabhaskar Reddy, Supdt Sri Jnana Prakash and other temple officials and devotees participated took part in this fete.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి చక్రస్నానం

ముగిసిన బ్రహ్మోత్సవాలు

మే 29, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, చక్రత్తాళ్వార్‌ ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి కపిలతీర్థంలోని ఆళ్వార్‌ తీర్థానికి చేరుకున్నారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అక్కడ స్నపనతిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత టిటిడి పరిపాలనా భవనం ఎదుట గల పి.ఆర్‌.తోటకు వేంచేశారు.

సాయంత్రం 5 గంటలకు స్వామివారు పి.ఆర్‌.తోట నుండి ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 9.10 గంటల నుండి 9.30 గంటల వరకు ధ్వజావరోహణం జరుగనుంది. ఈ కార్యక్రమంతో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి అన్నదానం విభాగం ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు భక్తులకు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వాహన సేవల సమయంలో ఉచితంగా మజ్జిగ, అన్నప్రసాదాలను వేలాది మందికి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీజ్ఞానప్రకాష్‌ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.