జూలై 6న టిటిడిలో వినియోగించిన నెయ్యి టెండర్‌ కమ్‌ వేలం

జూలై 6న టిటిడిలో వినియోగించిన నెయ్యి టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2017 జూలై 03: టిటిడిలో వినియోగించిన నెయ్యిని రేట్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన ఆరు నెలల కాలం పాటు సేకరించేందుకు జూలై 6వ తేదీన టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది. తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్‌ కమ్‌ వేలం నిర్వహిస్తారు.

టెండర్‌లో పాల్గొనదలచిన వారు రూ.5000/- ఇఎండిగా చెల్లించాల్సి ఉంటుంది. మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌(వేలం) వారి కార్యాలయంలో జూలై 6వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట లోపు రూ.200/- చెల్లించి టెండర్‌ పత్రాలు పొందొచ్చు. ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం) వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.