TEPPOTSAVAM COMMENCES _ శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

TIRUMALA, 03 MARCH 2023: The annual Teppotsavams commenced on a grand religious note in Tirumala on a pleasant evening on Friday.

Sri Sita Lakshmana sameta Sri Ramachandra Murty took out a celestial ride on the finely decked float on the sacred waters of Swami Pushkarini.

The devotees who thronged the Pushkarini to catch a glimpse of the deities were mesmerized by their divine charm.

TTD EO Sri AV Dharma Reddy, SE 2 Sri Jagadeeshwar Reddy, Deputy EO Sri Ramesh Babu, Garden Deputy Director Sri Srinivasulu, VGO Sri Bali Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

మొద‌టిరోజు శ్రీ సీతారామలక్ష్మణులు తెప్పపై విహారం

తిరుమల, 2023 మార్చి 03: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, టీటీడీ ఈఓ శ్రీ ఏ వి ధర్మా రెడ్డి, ఎస్ ఈ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు , ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.