TEPPOTSAVAM HELD _ తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి విహారం
TIRUMALA, 06 MARCH 2023: On a penultimate day, Sri Malayappa and His two consorts Sridevi and Bhudevi took out a celestial ride on a flotilla on Monday evening.
The processional deities in all their celestial splendour cheered devotees by taking five rounds on the holy waters of the temple tank.
TTD EO Sri AV Dharma Reddy along with Supreme Court Judge Justice Pankaj Mithal, other TTD officials were also present.
తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి విహారం
తిరుమల, 2023 మార్చి 06: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు.
ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి, సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ పంకజ్ మితల్, ఆలయ డిప్యూటీవో శ్రీ రమేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.