ARRANGEMENTS FOR KUMARADHARA THEERTHA MUKKOTI HELD _ శ్రీ కుమారధార తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

DEVOTEES WITH CHRONIC DISEASES APPEALED TO AVOID TREKKING

 

TIRUMALA, 06 MARCH 2023: Under the instructions of TTD EO Sri AV Dharma Reddy, Tirumala VGO Sri Bali Reddy along with his Vigilance counterpart Sri Giridhar and DSP Tirumala Sri Venugopal held a detailed review meeting with all departments on Kumaradhara Theertha Mukkoti on Monday.

 

The review meeting was held at the Conference Hall in PAC 4. Kumaradhara Theertham is considered one among the scores of torrents located in the Seshachala ranges in Tirumala. The devotees trekking Kumaradhara Theertham will be allowed from 6am onwards and the path will be closed by 12noon. TTD has arranged distribution of “Ready to Eat” Annaprasadam and water at Kumaradhara Dam point. An emergency vehicle with Medical Aid will also be kept ready.

 

About 300 Vigilance, Forest, Police personnel are being drafted for Kumaradhara Theertha Mukkoti for the safety of trekkers besides 50 Srivari Sevakulu for serving Annaprasadam and Water.  Devotees with Asthma, cardiac diseases, obesity, hypertension, diabetes and other chronic diseases are appealed to avoid the trekking in view of the health safety and security. 

 

The devotees are requested to follow these guidelines and make their Kumaradhara Theertha Mukkoti trekking a memorable experience.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కుమారధార తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

– యాత్రికుల కోసం అన్నప్రసాదం మరియు తాగునీరు సౌకర్యాలు

– కుమారధార తీర్థ ముక్కోటికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులు అనుమతించబడరు

తిరుమల, 2023 మార్చి 06: మార్చి 7న తిరుమల శ్రీ కుమారధార తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

భక్తులను ఉదయం 6 గంటల నుండి తీర్థానికి అనుమతిస్తారు. కుమారధార తీర్థం ముక్కోటికి వెళ్లే భక్తులకు కుమారధార డ్యాం వద్ద అన్నప్రసాదం మరియు తాగు నీరు అందిస్తారు. వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తారు.

భక్తుల భద్రతను పర్యవేక్షించేందుకు కుమారధార తీర్థం వరకు దాదాపు 300 మంది విజిలెన్స్, పోలీస్, ఫారెస్ట్ సిబ్బంది కేటాయించారు. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, స్థూలకాయం, రక్తపోటు ఉన్న భక్తులు మరియు వృద్ధులు ట్రెక్కింగ్ చేయ వద్దని మనవి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పాప వినాశనం నుండి కుమారధార తీర్థ ప్రవేశం మార్గం మూసివేయబడుతుంది. కావున భక్తులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని తమ కుమారధార తీర్థ ముక్కోటి యాత్రను ఫలప్రదం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష

టీటీడీ ఈఓ శ్రీ ఏవి.ధర్మా రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 7, మంగళవారం జరగనున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై సోమవారం ఉదయం పి.ఏ.సి-4 లోని మీటింగ్‌ హాల్‌లో అన్ని విభాగాల అధికారులతో తిరుమల విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్, తిరుమల డిఎస్పీ శ్రీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.