TEPPOTSAVAMS COMMENCED AT SRI PAT _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో తెప్పోత్సవాలు ప్రారంభం

Tiruchanoor, 1 June 2020: The annual Teppotsavams of Sri Padmavathi Ammavaru at Tiruchanoor has commenced on Monday.

 In view of COVID 19 restrictions, this five-day festival will be observed within temple premises instead of float fete in Padma Pushkarini.

 On the first day, Abhishekam was performed to Sri Krishna Swamy between 2:30 pm and 4 pm while on June 2 Sundara Raja Swamy and last three days to Goddess Padmavathi snapanam will be observed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI    

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో తెప్పోత్సవాలు ప్రారంభం

ఏకాంతంగా నిర్వహణ

తిరుపతి, 2020 జూన్ 01: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల‌ పాటు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా జరుగుతాయి.

కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఉత్సవమూర్తుల‌ను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చే అవకాశం లేనందున ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకు శ్రీకృష్ణస్వామివారికి అభిషేకం నిర్వహించారు.

జూన్‌ 2న శ్రీ సుందరరాజస్వామివారికి
జూన్‌ 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.