TEPPOTSAVAMS IN PADMASAROVARAM_ శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన తిరుపతి జెఈవో శ్రీ పోలభాస్కర్‌

Tirupati, 13 June 2018: The massive temple tank, Padma Sarovaram is gearing up to host the colourful annual float festival from June 23 to 27 in Tiruchanoor.

This five day fete is observed every year here in the month of Jyesta. This festival begins on Dasami and concludes on Pournami. Goddess Padmavathi Devi in all Her divine splendour takes celestial ride on the finely decked float gliding along the holy waters of the temple tank, blessing the devotees.

Tirupati JEO Sri P Bhaskar released the posters related to the temple in his chambers on Wednesday evening. Temple Sp.Gr.DyEO Sri P Munirathnam Reddy was also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన తిరుపతి జెఈవో శ్రీ పోలభాస్కర్‌

తిరుపతి, 2018 జూన్‌ 13: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్‌ 23 నుండి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరుగనున్న వార్షిక తెప్పోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను టిటిడి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తెప్పోత్సవాల్లో ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జూన్‌ 23వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీసుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీపద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారని తెలిపారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తామని వివరించారు.

అమ్మవారికి జూన్‌ 26వ తేదీ రాత్రి గజవాహనం, 27వ తేదీ రాత్రి గరుడ వాహనసేవలు వైభవంగా జరుగనున్నాయని జెఈవో తెలియజేశారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఆర్జితసేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా జూన్‌ 23 నుండి 27వ తేదీ వరకు అమ్మవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు. అదేవిధంగా జూన్‌ 25న అష్టోత్తర శతకలశాభిషేకం, జూన్‌ 27న లక్ష్మీపూజ వారపుసేవలు రద్దు కానున్నాయి.

ఈ కార్యక్రమంలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.