REMOVAL OF SWARNA KAVACHAM ON JUNE 19_ జూన్‌ 19న శ్రీమలయప్పస్వామివారికి బంగారు కవచం తొలగింపు

Tirumala, 13 June 2018: In connection with annual Jyesthabhishekam, the Swarna Kavacham (golden armour) which is adorned to Lord Sri Malayappa Swamy, Goddesses Sridevi and Bhudevi will be removed on June 19.

Meanwhile Jyestabhishekam is the special Abhishekam performed to the deities in the month of Jyesta. This is also known as Abhidheyaka Abhishekam. “Abhidheya” in sanskrit means to protect some thing from being damaged.

This ceremony will be observed for three days in Tirumala temple from June 24 to 26. TTD has cancelled Vasanthotsavam on first day, Visesha Puja and Vasanthotsavam on second day and all arjitha sevas on the last day following the festival.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 19న శ్రీమలయప్పస్వామివారికి బంగారు కవచం తొలగింపు

జూన్‌ 13, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్‌ 24 నుండి 26వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం జరుగనున్న నేపథ్యంలో జూన్‌ 19వ తేదీన శ్రీ మలయప్పస్వామివారికి బంగారు కవచాన్ని తొలగిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.

ఇందులోభాగంగా మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహించిన తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు.

జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్‌ 24న వసంతోత్సవం, జూన్‌ 25న విశేషపూజ, వసంతోత్సవం, చివరిరోజైన జూన్‌ 26న అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. కాగా తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.