THIRD EDITION OF AYODHYAKANDA AKHANDA PARAYANAM ON SEPTEMBER 9 _ సెప్టెంబర్ 9న మూడవ విడ‌త‌ అయోధ్యా కాండ అఖండ పారాయ‌ణం

TIRUMALA, 08 SEPTEMBER 2023: The third edition of Ayodhyakanda Akhanda Parayanam will be held on September 9 at Nadaneerajanam stage in Tirumala. SVBC will telecast the program live from 7 am to 8.30 am.

A total of 139 shlokas from 9th to 11th sargas of Ayodhya Kanda will be recited.  Similarly, 25 shlokas of Yogavasistam and Dhanvantari Mahamantra will also be rendered taking the total to 164 Shlokas.

SV Vedic University, TTD Vedic Scholars, TTD Sambhavana Scholars, Annamacharya Project, National Sanskrit University Scholars, Dharmagiri pundits will participate in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబర్ 9న మూడవ విడ‌త‌ అయోధ్యా కాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2023 సెప్టెంబర్ 08: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై సెప్టెంబర్ 9న శనివారం మూడవ విడ‌త‌ అయోధ్యా కాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

అయోధ్యాకాండలోని 9 నుండి 11వ సర్గల వ‌ర‌కు గ‌ల 139 శ్లోకాలను పారాయణం చేస్తారు. అదేవిధంగా యోగవాశిస్టం, ధన్వంతరి మహామంత్రం కలిపి 25 శ్లోకాల పారాయణం జరుగుతుంది. మొత్తం 164 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్వి వేద విఙ్ఞాన పీఠం, ఎస్వివేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.