PAVITROTSAVAMS IN TONDAMANADU_ ఆగ‌స్టు 13 నుండి 15వ తేదీ వ‌ర‌కు తొండమనాడు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 10 Aug. 19: The annual Pavotrotsavams in Tondamanadu will be observed from August 13 to 15 while Ankurarpanam was observed on Saturday.

On the first day Pavitra Pratista, second-day Pavitra Samarpana and on last day Purnahuti will be observed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 13 నుండి 15వ తేదీ వ‌ర‌కు తొండమనాడు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2019 ఆగస్టు 10: టిటిడి అనుబంధ ఆలయమైన తొండమనాడులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 13 నుండి 15వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 12న సాయంత్రం 6.00 గంట‌ల‌కు అంకురార్పరణంలో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.

ఇందులో భాగంగా ఆగస్టు 13న ఉద‌యం 9.00 నుండి మ‌ధ్యాహ్నం 1.00 గంట వ‌ర‌కు పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, ఆగ‌స్టు 14న ఉద‌యం 9.00 నుండి మ‌ధ్యాహ్నం 1.00 గంట వ‌ర‌కు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు నిత్య ఆరాధ‌న‌, కుంభ ప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఆగస్టు 15న ఉద‌యం 8.00 నుండి మ‌ధ్యాహ్నం 2.00 గంటల‌ వ‌ర‌కు మహా పూర్ణాహుతి, ప‌విత్ర విత‌ర‌ణ‌, చ‌క్ర‌స్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంత‌రం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు వీధిఉత్స‌వం, ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ పవిత్రోత్సవాన్ని ఆర్జిత సేవగా ప్రవేశపెట్టారు. రూ.200/- చెల్లించి ఇద్దరు గృహస్థులు పాల్గొనవచ్చు.

ఈ సంద‌ర్భంగా టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.