Three day Annual AVATHAROTSAVAM OF SRI SUNDARAJA SWAMY VARU in Tiruchanur concludes _ వైభవంగా ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు

On the concluding day of ongoing three day Annual Avatharotsavam of Sri Sundaraja Swamy Varu, the processional deity of Sri Sundaraja Swamy Varu in taken out in procession atop GARUDA VAHANAM in Sri Padmavathi Ammavari Temple, Tiruchanur on Tuesday evening.
 
Sri L.V.Subramanyam, Executive Officer, Sri Gopalakrishna, DyEO(PAT), Sri Venugopal, AEO and large number of devotees took part
 

వైభవంగా ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు

తిరుపతి, 2012 జూలై 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారికి మూడు రోజుల పాటు జరిగిన అవతార మహోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరిరోజైన మంగళవారం ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి  సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.15 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో పరిసర ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ గోపాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.